Jump to ratings and reviews
Rate this book

విశ్వ దర్శనం - భారతీయ చింతన

Rate this book
తత్వ శాస్త్రాధ్యయనంవల్ల ప్రయోజనం ఏమిటి? భౌతికశాస్త్రాలు అతి వేగంగా పురోగమిస్తూ, మానవ జీవిత విధానాన్ని మార్చివేస్తున్న ఈ కాలంలో ఎవరికి కావాలి తత్వమీమాంస అని కొందరు ప్రశ్నించవచ్చు.

ఇది అనాలోచిత వైఖరి తత్వజిజ్ఞాస మానవ నాగరికతకే పునాది వంటిది. వివిధ కాలాలలో ప్రజల మత, సాంఘిక, నైతిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల మీద, విశ్వాసాల మీద ఆయా కాలాల నాటి తత్వవేత్తల ప్రభావం ఎంతో ఉన్నది.

ఈ రచన ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలో ఉన్నవారినే కాక, యువతరం దృష్టిని కూడా ఆకర్షించగలదని ఆశపడుతున్నాను. తత్వశాస్త్రాధ్యయనం చేసిన వ్యక్తి మనస్సు మరింత పరిణతం, మేధ మరింత నిశితం, హృదయం మరింత విశాలం అవుతాయని నాకు అనిపిస్తున్నది.

విల్ డ్యూరాంట్ తన “ప్లెజర్స్ ఆఫ్ ఫిలాసఫీ” లో పేర్కొన్నట్టు తత్వ శాస్త్రాధ్యయనంలో ఒక అనిర్వచనీయానందం కూడా ఉన్నది.

అధ్యయనా నంతరం పఠిత తనకు తానుగా, పూర్తిగా తనదే అయిన ఒక నూతన జీవిత దృక్పథాన్ని ఏర్పరచుకొనగల శక్తిని సముపార్జించు కోగలడని నాకొక నమ్మకం.

భారతీయ మేధావుల మనః కుహరాంతరాలలోనికి, వారి మనోవాల్మీకాలలోనికి, వారు సృష్టించిన మంత్రనగరి సరిహద్దులలోనికి ఈ సాహసయాత్ర కొలంబస్ అమెరికాఖండ యాత్రకు, ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రలోక యాత్రకు తీసిపోదు. ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా పాఠకులను ఆహ్వానిస్తున్నాను.

- రచయిత

595 pages, Paperback

19 people are currently reading
168 people want to read

About the author

Nanduri Ramamohana Rao

6 books3 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
22 (64%)
4 stars
7 (20%)
3 stars
2 (5%)
2 stars
0 (0%)
1 star
3 (8%)
Displaying 1 of 1 review
Profile Image for Aditya Annavajjhala.
56 reviews7 followers
March 24, 2021
జీవితంలో ప్రతి మనిషికి కొన్ని ప్రశ్నలు తప్పకుండా వస్తాయి...

సంతోషం అంటే ఏంటి?? దానిని సాధించడం ఎలా??

దేవుడు అనే వాడు అసలు ఉన్నాడా?? లేదా అది కేవలం మన భ్రమ మాత్రమేనా??

మనిషి గొప్పవాడా?? లేదా ఈ ప్రకృతి గొప్పదా?? మనిషి కేవలం ఈ విశాల విశ్వంలో ఒక ఇసుక రేణువు మాత్రమేనా?? లేదా ఈ విశ్వామంతా మనిషి కోసమే ఉందా??


బుద్దుడు, జైనుడు చెప్పింది ఏంటి??

భగవద్గీత మొత్తం నిజంగా కృష్ణుడే అర్జునికి చెప్పాడా??

ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి ఎప్పుడొక్కపుడు వస్తూనే ఉంటాయి.. కానీ ఆలోచించే అంత సమయం, ఆలోచన శక్తి మనలో లేకపోవచ్చు...

ఈ ప్రశ్నలకి సమాధానం తో పాటు మనలో కొంచెమైనా తత్వచింతన కోసం నండూరి రామ్మోహన్ రావు గారు రాసిన పుస్తకాలు తప్పకుండా చదవాల్సినవి..

భారతీయ దర్శనం లో అప్పటి వేదాలు, ఆర్యలు, ద్రావిడల నుంచి నిన్న మొన్నటి అరవిందుడు, జిడ్డు కృష్ణమూర్తి వరకు చాలా కులంకుషంగా వివరణ మరియు చింతన ఉంది..

మన మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఎన్నో తత్త్వ, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు ఇవి..
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.