ఇప్పుడున్న సమాజంలో స్త్రీల కేమైనా సమస్యలున్నాయా లేవా; ఉంటే అవి ఏమిటి; ఈనాడు స్త్రీ పురుష సంబంధాలు ఎలా ఉన్నాయి; అవి ఎలా మారాలి - అనే విషయాలు స్త్రీ పురుషులకు తెల్పడమే ఈ నవల ఉద్దేశ్యం.
జీవితాల్లో కష్టాల్నీ అవమానాల్నీ పోగొట్టి, సుఖసంతోషాల్నీ, ఆత్మగౌరవాన్నీ ఇవ్వగలిగేది - సరైన జ్ఞానం. న్యాయాన్ని సమానత్వాన్నీ ఇవ్వగలిగేదే సరైన జ్ఞానం! బాధల్ని చెక్కు చెదరనివ్వకుండా వుంచేదీ, పరిస్థితుల్ని మార్చలేనిది తప్పుడు జ్ఞానమే. అందుకే స్త్రీలందరికీ, తమ జీవితాలకు సంబంధించిన అసలు జ్ఞానం తెలియాలి.
కానీ, స్త్రీల సమస్యలు, స్త్రీల జీవితాలకే పరిమితం కాదు. అవి పురుషుల జీవితాలకు సంబంధంలేని విషయాలు కావు. స్త్రీ జీవితం, పురుషుడి జీవితం కూడా! స్త్రీకి సుఖ సంతోషాలు లేని చోట, అవి పురుషుడికీ వుండవు. స్త్రీల సమస్యల మీద స్త్రీలకు సరైన జ్ఞానం కలగడం ఎంత అవసరమో, పురుషులకు సరైన జ్ఞానం కలగడం కూడా అంత అవసరమే. స్త్రీ పురుషులకు, ఒకరితో ఒకరికి సంబంధాల్లేని వేరు వేరు జీవితాలు లేవు. ఇద్దరిదీ ఒకే జీవితం.
సమస్యల పట్ల సరైన జ్ఞానమూ, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సరైన కార్యక్రమమూ, ఎవరి చేతుల్లో వుంటాయో వాళ్ళే ఆ సమస్యల్ని పరిష్కరించగలరు. వాళ్ళే ఈ సమాజాన్ని మార్చగలరు. అలా కాని వాళ్ళ వల్ల ఆ పని ఎన్నటికీ జరగదు.
సమస్యల్లో వుండే వ్యక్తి, తన జ్ఞానం (తన భావాలు, తన ఆలోచనా విధానం, తన చైతన్యం) సరైన మార్గంలో వుండేలాగ చూసుకోవాలి. తన జ్ఞానాభివృద్ధికీ, తన జీవితాభివృద్ధికీ, వ్యక్తిగతంగా తను చేసుకోవలసినదంతా చేసుకోవాలి.
మార్క్సిజం ఇచ్చే జ్ఞానమే లేకపోతే, 'జానకి విముక్తి' లేదు. ఏ స్త్రీ విముక్తీ వుండదు.
లోగడ ఇదే పేరుతో మూడు భాగాలుగా వచ్చిన రంగనాయకమ్మగారి రచన ఇది. దీని రచనా కాలం మొదటి భాగం 1977, రెండవ భాగం 1980లో, మూడవ భాగం 1981లోనూ పాఠకుల సౌకర్యార్థం మూడు భాగాల్నీ ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు ఈ నవలా రచయిత్రి రంగనాయకమ్మగారు.
Note: Before marriage, RN used her maiden surname ‘Daddanaala Ranganayakamma’ in her works, and after the marriage, she adopted the surname ‘Muppala’ as was the convention. After the separation, she stopped using the adopted surname and began to write without any surname: simply as ‘Ranganayakamma’
రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.
రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.
రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.
జానకి విముక్తి — fiction అయినా, non-fiction చదివిన అనుభూతి ఇస్తుంది (అది కూడా boring way లో😅).మూడు భాగాలుగా విస్తరించిన జానకి విముక్తి అనే ఈ పుస్తకం చదవడం అంటే ఒక marathon run లాంటిది — మొదట ఆసక్తిగా మొదలవుతుంది, మధ్యలో తడబడుతుంది, చివరికి finish line దాటేసరికి “thank God, over!” అనిపిస్తుంది. 😅
భాగం 1:
మొదటి భాగం బాగానే మొదలవుతుంది. మంచి సంభాషణలతో కథ ఆసక్తిగా సాగుతుంది. ఆసక్తికరమైన సంభాషణల వల్ల పాఠకుడికి “ఒక మంచి book చదవబోతున్నాం” అనిపిస్తుంది. ముఖ్యంగా మూర్తి పాత్ర అతని సన్నివేశాలు, అతని సంభాషణలు, తెలివైన సూచనలతో ఆసక్తికరంగా ఉంటాయి.చివరలో ఒక మంచి cliffhanger తో ముగుస్తుంది, తదుపరి భాగం కోసం పాఠకుడిలో ఆసక్తి పెంచుతుంది.
భాగం 2:
ఇది repetition festival! జానకి కష్టాలు, కష్టాలు, మళ్లీ కష్టాలే… .సన్నివేశాలు బాగానే ఉంటాయి, ఆసక్తికరమైన సంభాషణలు కూడా ఉన్నాయి. కానీ సీన్‌ను లాగేస్తూ, “ఇంకా ఎందుకు చెబుతున్నావమ్మా జానకి!” అనే భావనతో పేజీ తిప్పుకుంటూ వెళ్ళిపోతాం.మధ్యలో అకస్మాత్తుగా communist సిద్ధాంతాలు ప్రవేశిస్తాయి — అవసరం లేని చోట Marxist మంత్రాల పేజీలు పాఠకుడి మెదడును buffer చేయిస్తాయి. 🙃
భాగం 3:
ఈ భాగంలో 90% చర్చలు communist, feminist భావజాలం గురించే ఉంటాయి.
అనవసరమైన పాత్రల సంభాషణలు ఎక్కువగా ఉంటాయి — వీరి మాటలు కథకు పెద్దగా సంబంధం లేకున్నా పేజీలను నింపేస్తాయి.
ప్రధాన పాత్ర అయిన జానకి తన మార్పు వైపు చేసే ప్రయాణం గురించే మిగిలిన కథ ఉండాలి. కానీ కొత్తగా ప్రవేశించిన పాత్రలు కథకు తగినట్లు కాకుండా, సంబంధం లేని విషయాల మీద మాట్లాడుతాయి.
రచయిత్రి point of view తో, కొంతమంది అంగీకరిస్తారు, మరికొందరు వ్యతిరేకిస్తారు — కానీ ఈ అనవసరమైన conversation వలన irritation మాత్రం అందరికీ గ్యారంటీ!
Communist అయినా, feminist అయినా తలనొప్పి తప్పదు.
అలాంటి conversations అంటే సాధారణ పాఠకుడికి అయితే full torture — “ఇది debate showనా లేక novelనా?” అనిపించే స్థాయిలో ఉంటుంది. 😅
మొత్తానికి:
జానకి విముక్తి అనే 500 పేజీల (boring) పుస్తకం పూర్తయ్యేసరికి, పాఠకులకు కూడా “విముక్తి” లభించిన భావన వస్తుంది.
This entire review has been hidden because of spoilers.
Book which shows the problems faced by house wife women in general & how she had a successful married life with the help of Communism is the main plot.
The Written language is so witty & simple, makes us think and understand the problems of women.
Few parts in this book are completely dedicated to understanding communism in simple words, though these teachings help in understanding the story as well.
A good read to understand communism & problems of women from a women's perceptive
Outdated and tiresome. The entire narrative is filled with communist propaganda, the first and third parts especially. The story and the characters have no depth. Everyone is unidimensional, either utterly evil or completely naive. It seemed ridiculous to victimize an entire gender while villifying the other gender. Janaki's naivety was irksome, bordering on stupidity. Her husband and his mother have a single track mind of making her life hell. The only enlightened people in this book are the communists.
There are some insights into how abusers manipulate and lie, why victims stay in abusive relationships. But the author missed the opportunity to delve deeper into the human psyche and instead followed a reductionist way of looking at everything though communist lens of power imbalance. It would have made for a good read with more character development - why is the husband so entitled and abusive? How did the mother in law, who was once a young wife navigate the hardships of marriage and what prompted her to turn so vile towards her daughter in law? Blaming it all on society and stereotyping all wives as victims and all husbands and mothers in law as abusers is outright ignorance.
పుస్తకంలోని కథ 1977 లోనిది అయినప్పటికీ ఈ రోజుల్లో కూడా సందు దొరికితే అలాగే ప్రవర్తించే అత్తగార్లు ఉన్నారు. పెళ్లి కాని అమ్మాయిలు ఊహాలనుండి బయటకు వచ్చి వాస్తవం తెలుసుకోవడం కోసం తప్పక చదవవలసిన పుస్తకం. available at Chirukaanuka .com