ప్రేమంటే ఇవ్వడం మాత్రమే, మనం తిరిగి ప్రేమలో తీసుకోవడం మొదలుపెడితే, ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు అని చక్కగా చెప్పారు. ఈ పుస్తకం ప్రతి మనిషి చదవాల్సిన అవసరం ఉంది. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాలు, వాటి అవసరాలు గురించి చాల కూలంకుషంగా వివరిస్తారు. ఈ పుస్తకం ఒక కల్పనే అయినా, ఇది ప్రతి ఒక్కరికీ చాలా దగ్గరగా relate చేసుకునే లా ఉంది. యండమూరి గారి అద్భుత రచనలలో ఇది ఒకటి.