"పాతనంతా తిరస్కరించడమే అభివృద్ధి అనుకుంటారు కొందరు" అనేది, నూతనమైన ఆలోచనలమీద ఒక విమర్శ! కానీ, ఇది 'పాత' కాదు. 'పాత' అయిపోలేదు. 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఈ నాటి సాంఘిక సమస్యలకు 'రామనామ జపాన్ని' పరిష్కారంగా చెప్పే ఏ ఒక్క సంఘటన అయినా చాలు - ఆ గ్రంథం 'పాతదైపోలేదని' నిర్ణయించడానికి!
ఈ ప్రయత్నానికి అర్థం - పాతనంతా తిరస్కరించడం కాదు. 'పాత' అంతా మానవ చరిత్రే. ఆ 'చరిత్ర పరిణామం'లో, రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ, వీటిని స్పష్టం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.
Note: Before marriage, RN used her maiden surname ‘Daddanaala Ranganayakamma’ in her works, and after the marriage, she adopted the surname ‘Muppala’ as was the convention. After the separation, she stopped using the adopted surname and began to write without any surname: simply as ‘Ranganayakamma’
రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.
రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.
రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.
నాకు 12సం||ల అప్పుడు దురదర్శన్ tv లో రామాయణం సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా చూసి పాత కాలపు చరిత్రని దైవ స్వభావం పేరుతో పిక్చరైజేషన్ చేయటం లో ఏదో కన్ఫ్యూజన్ ఉంది. దర్శకులు ఆ కధని కధలో స్వభావాలను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పటం లో తెలిసో తెలియకో ఏవో కొన్ని విషయాలు అంటే ఆ కధలో పాత్రలకు లేనిపోని కీర్తి కిరీటాలు అంట కడుతూ అతిమంచితనాన్ని ఆపాదించారనిపించింది. కధలో సీత లక్ష్మణుడిని అనుమానించి తిట్టే సీన్ చూసి చాలా చిరాకు వచ్చింది. అదేంటి సీత దేవత అంటారు కదా! పాపం లక్ష్మణుడు మంచివాడు కదా ఏమిటి అంత చెత్తగా తిట్టింది? ఈ కధలో మంచి స్త్రీ పాత్రలే ఇలా ఉంటే ఇక హీరో అయిన రాముడు, వామ్మో ఇక ఈ కధలో విలన్ ఎలా ఉంటాడో? ఎందుకొచ్చిన గోల ఈ సినిమా చూడుకూడదు అనిపించింది. మళ్ళీ అసలు కధలో తెలుసుకోవలసినది ఏదో ఉంది. పాత కాలపు కధ, ఆ కాలపు చరిత్ర లో మానవ స్వభావాలు సరిగ్గా జనాలకు అర్ధమయ్యేలా ఎవరైనా ఓ సినిమా తీస్తేనో లేదా కధలా రాస్తేనో సమాజానికి ఉపయోగం గా ఉంటుంది. అనిపించింది. ఆనాటి నా కోరిక ఇలా రంగనాయకమ్మ గారి ''రామాయణ విషవృక్షం'' చదవటం తో తీరింది. థాంక్స్ టు రంగనాయకమ్మ గారు.
Mythology లేదా పురాణ శాస్త్రం అంటే పూర్వం జరిగిన లేదా ఎన్నో ఏళ్లుగా చెప్పబడిన కథల సమూహం అని అంటారు.. ప్రతి మతానికి, ప్రతి నాగరితలో ఇలాంటి ఎన్నో కథలు, గాథలు ఉన్నాయి.. అలానే మన హిందూ మతంలో,సనాతన ధర్మం లో కూడా పురాణాలు ఉన్నాయి.. వాటిల్లో ముఖ్యమైనవి రామాయణం, మహాభారతాలు. ఇవి నిజంగా జరిగాయి అని, లేదు కేవలం కల్పితాలు మాత్రమే అని వాదనలు ఉన్నాయి.. వాటితో ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళటం లేదు..
రామాయణ భారతల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది రామాయణం. అందుకు ఎన్నో కారణాలు ఉండచ్చు కానీ ముఖ్య కారణం రామాయణంలో ముఖ్య పాత్ర "రాముడు"ని ఆదర్శ పురుషుడుగా చిత్రీకరించాడమే. ఇంత ప్రాచుర్యం పొందిన రామాయణం మీద కూడా ఎన్నో విమర్శ గ్రంధాలు, వ్యాసాలు వచ్చాయి.. కానీ వాటిల్లో బాగా ప్రాచుర్యం పొందింది రంగనాయకమ్మ గారు రాసిన "రామాయణ విషవృక్షం".
ప్రతి వస్తువును ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఊహించుకొని, ఆ విధంగా అనుభవించడం సహజం. ఉదాహణకు ఒక చెట్టు బెరడును carpenter చూస్తే దానితో కుర్చీలు చెయ్యచ్చు అనుకుంటాడు, అదే ఒక సైనికుడు చూస్తే దానిని రక్షణ కోసం వాడుకోవచ్చు అనుకుంటాడు.. ఇక్కడ తప్పొప్పుల ప్రశ్న అనేది లేదు కేవలం వాళ్ళు చూసిన దృష్టి బట్టి అవసరం మారిపోయింది అంతే.
రంగనాయకమ్మ గారు రాసిన "రామాయణ విషవృక్షం" కూడా ఇలాంటి ఒక రచనే. రంగనాయకమ్మ గారు చదివిన రామాయణం (అనువాదమే అనుకోండి) అర్దం చేసుకున్న దృష్టి వేరు. శ్రమ దోపిడీ, పితృస్వామ్య వ్యవస్థ, కొన్ని సంఘటనలు అప్పటి వాస్తవ జీవితంకి దూరంగా ఉండటం లాంటివి తెలుసుకొని ఆ విధంగా అర్దం చేసుకొనే ప్రయత్నం చేశారు అనిపిస్తుంది..
ఈ పుస్తకం రామాయణం కి Retelling లా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పటి వాస్తవ పరిస్థితిని చెప్తూ, రాక్షసులు, కోతులు వంటివి మనుషల్లో జాతులుగా ఎలాంటి అభూత కల్పనలు, శక్తులు లేని రామాయణం ని చెప్పే ప్రయత్నం చేశారు.
వాల్మీకి రాసిన రామాయణంలో (అనువాదాలు కూడా) ఎక్కడ కూడా పాత్రల మానసిక ఆలోచన గురించి ఉండదు. ఏదైనా పని వాళ్ళ ఇష్టంతో చేస్తున్నారా?? లేక అయిష్టతతో చేస్తున్నారా అనేది మనకి తెలీదు.. రంగనాయకమ్మ గారు పాత్రల మానసిక ఆలోచనల గురించి కూడా చెప్పడం నాకు బాగా నచ్చింది.
మనం నమ్మిన సిద్ధాంతంతో చదివిన రామాయణంలో రాముడు ఆదర్శ పురుషుడుగా అనుకున్నపుడు, తను నమ్మిన సిద్ధాంతం (కమ్యూనిస్ట్) లో రాముడైన, రావణుడైన కూడా ఒక రాజే, శ్రమ దోపిడీకి ముఖ్య అధికారి అని రంగనాయమ్మగారు నమ్మి రాసిన ఈ "రామాయణ విషవృక్షం" కూడా సబబు గానే అనిపిస్తుంది
Though She was criticizing Ram, I really liked this book. Her articulation on chemistry between ram and sita was brilliantly portrayed. As every writer treats sita as motherly figure and portray her as so from her childhood, but they forget sita was a girl and her tiny teeny attitude and her childish nature is not to be negated. Ranganayakamma has created an absolute character of sita.
Don't think anything to buy. It's an amazing and fabulous book. It says to the people to not believe in superstitious and it makes the people to get out of the blind believes and makes them a rationalist and humanist thank you very much RANGANAYAKAMMA is available at Chirukaanuka .com
రంగనాయకమ్మ గారు రాసిన పుస్తకాలలో ఇది మస్టర్పీస్.. ఆవిడకి ఒక ప్రత్యేక రచియతగా గుర్తింపు తీసుకువచ్చిన పుస్తకం. ఈ పుస్తకం లో ఆవిడ మన అందరికీ చిన్నప్పుడు నుండి చెప్పినా రామాయణం గురించి ఆ కథలోని పాత్రల మీద విశ్లేషణ ఈ పుస్తకం. ఈ పుస్తకం చదివితే మీరు సంపూర్ణ నస్తికునిగా మారిపోయిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు , అంత అబ్దుతంగా ఉంటుంది విశ్లేషణ. ఆవిడ తర్కం (Logic) , విశ్లేషణ (Analysis) కి ఎవరు అయ్యిన ఫిదా అవ్వాల్సిందే... అంత అబ్ధుతంగా ఉంటుంది. మీకు పుస్తకాలు.. చదివే అలవాటు ఉంటే..? తప్పకుండా చదవాల్సిన పుస్తకాలలో ఇది కూడా ఒకటి. ఈ పుస్తకం నుండి ఎం నేర్చుకోవాలి.. అంటే? "ప్రశ్న" అడుగు అడుగున మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి.. అంతే గానీ ఎది పడితే అది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు! నేను కచ్చితంగా ఒకటి చెప్పగలను... ఈ పుస్తకం మీరు చదివితే మీ వివేకం నూటికి 10 రెట్లు ఎక్కువ అవుతుంది అని నేను అనడం లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే? అది నిజం కనుక.. ఈ పుస్తకం మీకు ఎవరి ద్వారా పర్చియం అయ్యిన సరే.. మీరు ఈ పుస్తకం గురించి ఎప్పుడైనా విని ఉంటే... ఈ పుస్తకం తప్పక చదవండి.
An insight into Completely different view Of The Indian Epic Ramayana , Ranganayakamma Garu for Sure Deserve Our Respect For this wonderful Book. A perfect Book For those who Want To know About the Culture that we Admired and Still Continuing to Admire With Dumbness . Ranganayakamma Garu definitely Succeeded To feed Some food for thought to All those Who Just Read it 😊
I just learnt about Smt. Ranganayakamma garu and her writing a couple of days ago (just now read more about her in her website) and unable to hold myself i downloaded Ramayana Vishavruksham and started reading it.
In continuation of my current phase about learning more about our religious and ancient texts, i believe this book will enhance my understanding.
The predominant value that the author tries to instil is to question EVERYTHING that is written in our ancient texts, understand the content and context, nothing sacred about anything - not blindly following it.
Well having completed reading the book...i have learnt a few things that are popularly believed (lakshman rekha was never there in Valmiki Ramayanam); Surprised (the way Valmiki describes Sita physically); confused (did Rama know all the while, at THAT young age of about 16 years that he is God incarnate!!?? and sent to earth to kill Ravana? If yes, why the whole plot??!! He could have directly gone and finished his job in time!)
Ranganayakamma garu was quite opinionated about the character of Rama. The writing and foot notes confused me no end what is 'actually' present in Valmiki Ramayana and what is added by the author herself (the foot notes of course are all of the author) - many a time i thought the author's opinion / version and Valmiki's writing got intermixed in the text.
Mid way i lost a bit of focus and attention because of the predominant prejudice in the text (not that i was reverent to the characters).
Well...one need to make one's own conclusions about the book.