Jump to ratings and reviews
Rate this book

మన్యంరాణి

Rate this book

197 pages, Hardcover

First published January 1, 2012

4 people are currently reading
225 people want to read

About the author

Vamsi

26 books62 followers

Vamsy or Vamsi (born Nallamilli Bamireddy on 20 November 1956) is a Telugu Indian film director, screenwriter and music director known for his works in Telugu cinema. In 1985 he received the National Film Award for Sitaara.
Vamsy is one of the very few filmmakers in Telugu who tries to depict the nativity of the concerned story. Although he is well known for portraying the scenic beauty of Godavari and surrounding regions, the element of characterisation is the highlight in his films.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
27 (65%)
4 stars
12 (29%)
3 stars
2 (4%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 - 5 of 5 reviews
Profile Image for Aruna Kumar Gadepalli.
2,855 reviews116 followers
January 21, 2013
మన్యం రాణి ఈ నవల వంశీ రాసిన ఓ అందమైన నవల. అడవిని గురించి ఇంత అద్భుతంగా నేను ఏ నవల చదవలేదు. ఆడవిని కాపాడటానికి ఓ వ్యక్తి చేసే ప్రయత్నం అతని తపన గురించి అతనికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసే వారి గురించి ఇందులో వంశీ గారి వివరణ మెచ్చుకో దగ్గ విషయం. ఇందులో ముఖ్య పాత్ర కొమరం రాజమ్మ ఆమె అందం అమాయకత్వం వంశీ తీరిచిన తీరు అద్భుతం. ఆమెను చూసినతర్వాత పండుదొర, జూలూరి వీరేశలింగం, బెంజమిన్, బుజ్జిదొర వేరే వాళ్ళ గురించి ఆలోచించటం మానేస్తారు. కొమరం లచ్చన్న రాజమ్మ నాన్నకు మాత్రం రాజమ్మను పండుదొరకు ఇచ్చి పెళ్ళిచేసి అడవిని కాపాడే పనిని అప్పగించాలని అనుకుంటాడు, కాని రాజమ్మ లచ్చన్న కూతురని తెలియని పండుదొర ఆ ప్రయత్నానికి ఒప్పుకోడు. ఆడవిని దోచుకొవాలని చూసే వారి ప్రయత్నాలకు లచ్చన్న అడ్డుపడుతున్నాడని అతనిడిని చంపే ప్రయత్నాలు జరుగుతాయి, చివరగా రాజమ్మ పెళ్ళి బుజ్జిదొరతో నిర్ణయించటంతొ పెళ్ళిలో పండుదొర రాజమ్మను చూసి తనే రాజమ్మను పెళ్ళి చెసుకుంటానని అంటాడు అక్కడ గొడవ జరగడంతొ ఇద్దరిని చంపేస్తాడు తర్వాత అతను జైలుకు వెళ్తాడు. లచ్చన్న ఓ రొజు అడవిలొ తిరుగుతూ ఈ విషయాల్ని గురించి అలొచిస్తూ మరణిస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది ఈ నవల చదివితే తెలుస్తుంది. మనిషి అడవి సంబంధం ఇతర విషయాలు వంశీ అందంగా తీర్చిదిద్దారు. పుస్తకానికి మరింత అందం చేకూర్చాయి కళాప్రపూర్ణ బాపు గారి బొమ్మలు.
Profile Image for Rajitha Neerugatti.
19 reviews2 followers
October 20, 2024
This is the first Vamshi sir book I read... This is one the best books I have read regarding the forest and nature and human cruelty towards nature for money...thank you Vamshi sir for this 💎
Profile Image for Vidyasagar Darapu.
43 reviews11 followers
November 6, 2021
వంశీ రచనలన్నా, సినిమాలన్నా నాకు కొంచెం పక్షపాతం. వంశీ, సినీ దర్శకుడే కాదు, పాటలు రాస్తాడు, సంగీతం సమకూర్చుతాడు, కధలూ, నవలలూ రాస్తాడు. ఇన్ని చేసే బహుముఖ ప్రగ్యాశాలిని చుస్తే కొంచెం ఈర్ష్య మరియు గౌరవం ఎవరికుండదు చెప్పండీ !

ఇకపోతే, మన్యం రానికి వస్తే, ఈ పుస్తకం చదివాక మనసులో ఉండిపోయేది రాజమ్మ పాత్రే ! అందాల రాజమ్మ. పొడుగాటి ఒంపులు పోయే నడుం, నల్లటి చర్మం, పెద్ద కళ్ళు, ముత్యాల నవ్వుల రాజమ్మ. వెన్నెట్లో, చెరువులో తన అందం చూసుకు అబ్బురపడే రాజమ్మ. అందగాళ్ళు, డబ్బున్న వాళ్ళు, కండలు తిరిగిన వీరులు, ఆర్టిస్టులకే కాకుండా అంద విహీనులు, పిసినార్లకి కూడా మనస్ఫూర్తిగా తన అందాన్ని ఒప్పజెప్పుకోడానికి సంకోచించని రాజమ్మ. తన గొప్పతనం, తన నిర్మలత్వం, తన వికారం, తన అందం, తనలోని లోతు తో గొప్పలు పోక, అందర్నీ ఆదరించే రాజమ్మ.

ఇంత అందమైన మనిషి కాస్తా వంశీ చేతిలో పడింది. మచ్చ కోసం రాజేంద్ర ప్రసాద్ అమ్మాయిల వెంట పడినట్టు, రాజమ్మ కోసం కండలరాయుళ్లు, వీరులు, శిల్పులు, ఎగబాకుతారు. ఎవరికి చిక్కుతుందబ్బా అన్న ఉత్కంఠతతో ప్రేక్షకులకి రక్త పోటు వొస్తుంది.

ఒక పక్క రాజమ్మ కథైతే, మరోపక్క, మన్యం కధ మరియు ఆ మన్యాన్ని తల్లిగా భావించే లచ్చన్న కథ. పెదరాయుడు వెంట నీడలా వుండే, అడవి జనం. అడవి సంపదను దోచుకునే ప్లాన్ లో కాపిటలిస్టులు, ఫారెస్ట్ అధికారులు. వాళ్ళని బురిడీ కొట్టే ప్లాన్ లో లచ్చన్న.

ఈ విధంగా రాజమ్మ కధ మరియు అడవి కధ రసవత్తరంగా సాగి, చివర్లో అడవి దేవత గుడి ఒడిలో ముగుస్తుంది.

గోదావరి జిల్లా అడవుల వర్ణన చూసి, శ్రీకాకుళం (మా వూరు) జిల్లా అడవుల్ని వివరించాలన్న కుతూహలం ఏర్పడింది నాకు. పువ్వులు, పక్షులు, పిట్టలు, గాలులు, తేనె పట్టులు, చెట్లు, సెలయేర్లు, అడవి పల్లెలు, అడవి ప్రజల వర్ణనలతో, అడవి అందాలు, శబ్దాలు, వాసనలతో నిండి ఉంటుంది కధ.

పుస్తకంలో కొన్ని నచ్చని అంశాలు లేకపోలేవు. ఈ పుస్తకం, కధలా తక్కువ, స్క్రీన్ ప్లే లా ఎక్కువ అనిపిస్తుంది. ప్రతి పేజీకి సీన్ మారిపోతుంది. వంశీ అలా ఎందుకు చెయ్యాల్సి వొచ్చిందో అర్ధం కాదు. బహుశా సినిమా తీద్దాం అని రాసుకున్నాడేమో !
అడవి పక్షి, వృక్ష, క్రిమి కీటక వర్ణన విశృతంగా చేసాడు వంశీ. కానీ సిటీ వాసుడనైన నాకు పెద్దగా అర్థం కాలేదు. డిక్షనరీ లో చాలా పదాలకి అర్థం దొరకలేదు. అవి వంశీ చేసిన పద ప్రయోగాలేమో తెలియదు. పుస్తకం వెనుక ఆ పదాలకి వివరణ ఇస్తే బాగుండేది.
మోరల్ ప్రీచింగ్ కూడా చేసాడు పుస్తకంలో. గంజాయి పండించడం తప్పని దాన్ని కాల్చివేస్తారు అడవి జనం. కానీ, కల్లు మాత్రం అందరూ తప్ప తాగుతారు. రచయిత తరుపునుండి హిపోక్రసీ కనిపిస్తుంది కొంచెం. కధలో నాటకీయత పెంచడానికి కృత్రిమ కధా కల్పన కూడా చేసాడు. రాజమ్మ, తన వెంట పడే వాళ్లకి చాలా నాటకీయంగా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే చివర దాకా కనపడదు. చివర్లో అందరికీ ఒకే సారి యాదృచ్చికంగా కనపడుతుంది. విలన్లకి చంపే ఛాన్స్ ఇయ్యకుండా, లచ్చన్న చాలా రాండమ్ గా ప్రాణం వదిలేస్తాడు.

ఈ విమర్శలని పక్కన పెడితే, బాపూ బొమ్మల ప్రీతులకి, వంశీ సినిమాలు, కధలు నచ్చేవాళ్ళకి, తప్పక నచ్చే నవల ఇది. ఎక్కడా బోర్ కొట్టదు. ‘అబ్బా భలేగుందే పుస్తకం’ అనుకుంటారు. ‘ఆనాటి వాన చినుకులు’ అంత గొప్పగా రాయలేదు కనుక మరియు పైన చెప్పిన కారణాల వల్ల మూడు నక్షత్రాలు ఇస్తున్నాను.
Profile Image for Ramya.
274 reviews2 followers
April 7, 2022
This is my 1st book by this author. It's beautiful! as a result of its' being very descriptive concerning the forest and nature itself. It additionally talks about tribes that embrace their, traditions, beliefs, and lifestyles. I even have learnt a great deal about little villages
The plot was very fascinating. The difficulty I had to face was remembering names. Too many characters involved.
176 reviews9 followers
May 8, 2023
good book and you will enjoy it is available at chirukaanuka .com
Displaying 1 - 5 of 5 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.