Jump to ratings and reviews
Rate this book

ఖడ్గ సృష్టి [Khadga Srusti]

Rate this book
నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్‌

ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ

ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,

ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,

నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,

ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,

అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,

అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!

దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,

నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,

డియర్‌ కామ్రేడ్‌! విను! నాతో రా మునుముందుకి, ఈ

ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,

జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.

వాల్ట్‌ వైట్‌మాన్‌ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ 'కామ్రేడ్‌' శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు - మరికొన్ని అనువాద కవితలు (120) - వాటికి సంబంధించిన ఫుట్‌ నోట్స్‌ ఉన్నాయి.

Paperback

First published January 1, 1966

25 people are currently reading
665 people want to read

About the author

Srirangam Srinivasarao

39 books340 followers
Sri Sri (శ్రీ శ్రీ) is a Telugu author from Vishakapatnam. He was best known for his literary work Maha Prasthanam. The book talks about the social issues that people faced in 1930's and 40's. He influenced a lot of people with his works. He was considered as a child prodigy as he started writing poems at his will from the age of seven.
He broke the classical style of telugu writing and introduced free verse in telugu poetry. His works always addressed the contemporary issues in the society. He later worked in the telugu film industry. He wrote about 1000 songs for telugu films.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
97 (55%)
4 stars
48 (27%)
3 stars
23 (13%)
2 stars
5 (2%)
1 star
3 (1%)
Displaying 1 - 2 of 2 reviews
Profile Image for Rajesh CNB.
122 reviews7 followers
May 23, 2018
ఖడ్గ సృష్టి అంటే అందరికీ ఉత్సాహమే, ఒక ఖడ్గానికి తప్ప. ఖడ్గ సృష్టి అంటే సమ్మెట పోట్లు. ఖడ్గ సృష్టి అంటే కొలిమి కాల్పులు. ఖడ్గ సృష్టి అంటే సానరాయితో ఘర్షణ. ఎందుకు ఈ పోట్లు, కాల్పులు, ఘర్షణ? ఆశయసాధన కోసం.

ఈ కత్తి
ఊహాసమూహాల వ్యూహాలు పన్ని
వీరవిహారం చేస్తూ
రణక్షోణిలో
జనాక్షౌహిణులు కదలడానికి

ఇదీ ఖడ్గ సృష్టికి మూలకారణం. శ్రీ శ్రీ కవితలు అర్థం చేసుకోవటానికి కావలసిన నేపథ్యం మనకీ తునకలో బహిర్గతమౌతుంది. అతడి సాహిత్యం జనాక్షౌహిణులు కదిలించే ఖడ్గం.

సరే! ఇక విషయానికి వద్దాం. ఈ సంకలనంలో ఇరవై మూడు పద్యాలున్నాయి. వ్రాసిన మహానుభావుడిని విమర్శించే శక్తి నాకు లేదు. అంత జ్ఞానం కానీ పద విజ్ఞానం కానీ నాలో లేవు. నాకున్నదల్లా పదాలు చదువుతుంటే గుండెలో రగిలే భావాగ్నిని గమనించగలిగే శక్తి. కొన్ని కవితలు చదువుతుంటే రగిలిన నిప్పుసెగలు నిద్రను దూరం తరిమాయి.

తీర్మానాలూ ఉపవాసాలూ చేసాం
ఖద్దరూ కేకలూ వేశాం
మోసుకొచ్చాం స్వరాజ్యమ్మూట
మూట విప్పితే ఏమీ లేదు

భారతావనిలో సామాన్యుడి పరిస్థితి ఇదే. బానిసబతుకే నయమేమో. స్వరాజ్యం కోసం పోరాటమెందుకు. దానివల్ల మనకేం ఒరిగింది. ఆనాడు ఆంగ్లేయులు దోచుకున్నారు. ఈనాడు మనలో కొందరు దోచుకుంటున్నారు. ఈ భావం రాగానే నిస్పృహ ఆవరించింది. ఒక్కసారిగా కుప్పకూలి చచ్చిపోతే బాగు అనిపించింది. కానీ ఇంతలో ఏదో గుర్తుకొచ్చి ఓ నాలుగు పేజీలు వెనక్కి తిప్పి చూసాను.

అహింస ఒక ఆశయమే కానీ
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి

అందుకే జరిగింది ఈ ఖడ్గ సృష్టి. అంతవరకూ దరిచేరని నిద్రారాణి కన్నులపై ప్రేమగా చుంబించింది. జాలువారిన నయనద్వయానికి తోడుగా చిరునవ్వు. కలలో కరవాల దర్శనం. ఖడ్గ సృష్టి.

ఆంధ్రరాజ్యావతరణ తరుణంలో వ్రాసిన కవితలు నేటికీ అసందర్భమనిపించలేదు.

అంతా అగమ్యగోచరం
అంతా అరణ్యరోదనం
ద్వేషం ఇచ్చే పర్సెంటేజీ
ప్రేమ ఎలా ఇవ్వగలదు?

కష్టపడి ఆర్జించిన స్వాతంత్య్రం
గద్దలు తన్నుకు పోతాయి
కంచి మేక పాపం ఎప్పుడూ
కసాయివాణ్ణే నమ్ముకుంటుంది

మనమూ కంచి మేకలమే! రాష్ట్రాన్ని విభజించుకున్నాం. కేంద్ర సర్కారును నమ్మి. రెండు పిల్లుల కొట్లాటలో కోతి మాదిరి మోదీ ప్రభుత్వం నేతి రొట్టెలను ఆనందంగా ఆస్వాదిస్తోంది. తప్పెవరిది? కంచి మేకదా? కసాయివాడిదా? ఇదొకవైపైతే శ్రీ శ్రీ కలలింకోవైపు. "శరచ్చంద్రిక" లో జాబిలితో మాట్లాడుతూ అంటాడు

పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరికే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావు కదా నువ్వు!

ఎంత ధైర్యం కావాలి ఈ కల కనడానికీ, కవిత రాయడానికీ. ఒక వైపు సినిసిజం. మరోవైపు ఆశావాదం. ఇంకోవైపు నిర్వేదం. సినిసిజమనే కొలిమిలో, నిర్వేదపు సమ్మెట పోట్లతో, ఆశావాదపు సానరాయి మీద చదువరి మనసు కరవాలంగా మారుతుంది. మనకు తెలియకుండానే మనలో జరుగుతుంది ఖడ్గ సృష్టి. అదీ శ్రీ శ్రీ పవర్!

చదువరీ! బహు పరాక్! పుస్తకం చేతికి తీసుకున్నాక వెనకడుగు వేశావో, కమిలిన చేతులు, కాలిన వాసనా తప్ప ఏమీ మిగలవ్! ఎదో తమాషాకి చదువుదామని అనుకోకు. ఖడ్గ సృష్టికి తయారై రా. మనోకరవాలాన్ని ధరించి వెళతావ్ ప్రపంచాన్ని జయించడానికి.
Profile Image for Chandra Kanth.
41 reviews8 followers
September 13, 2016
There are books and there are BOOKS, this belongs to the second category.

It made me very sad to realize that time went past so quick, we completely forget that there are "Animuthyas" in telugu literature that date back to centuries...

Sri sri undisputedly is a revolutionary writer..
Strong suggestion to people interested in telugu literature. Ah that irony with which he presents Indian freedom struggle, thoese quotes about gandhiji _/\_
Displaying 1 - 2 of 2 reviews