ఖదీర్ బాబు గారు వ్రాసిన కథల్లో నేను చదివిన మొట్టమొదటి కథల సంపుటి ఇది.
ఎంచుకున్న అంశాలు సిటీ ప్రజల మనస్సుని తాకి తీరుతాయి. ఆడవాళ్ళ స్వేచ్ఛ, శ్రమ, పడే అపవాదులు, ఓర్చుకునే ఆగంతాలు, వారి ఆవేదన అన్ని బల్లగుద్ది క్లుప్తంగా పది పేజీల్లో చెప్పారు ఖదీర్ బాబు గారు ప్రతి కథలోనూ. ఆడవాళ్ల తో పాటు మగవారి మోసాలు సరసాలు, నిర్లక్ష్య వైఖరి, వారి ప్రేమ, వేదాంతం సమ పాళ్ళ లో కనిపిస్తాయి ఈ కథల్లో.
రోజువరీ జీవితం లోని అంశాలని లాగి కథలు గా మలిచాడు ఖదీర్ బాబు, Anton Chekhov లాగా.
స్త్రీ పైన తనై చూపించిన దిగులు బట్టి చలం influence బాగా ఉన్నదని అనిపిస్తుంది.
నిజాయితీ తో పూస గుచ్చినట్టు వ్రాసిన కధలు ఇవి. జోకులు, plot points, కథల్లో విచిత్రమైన మలుపులు ఆశించ కూడదు.