Jump to ratings and reviews
Rate this book

కుట్రదారు కోడి

Rate this book
ఒక కోడి కూసిన అసాధారణమైన అరుపుతో సైనిక వందనానికి సిద్ధమైన సమూహం కలవరపడుతుంది. ఈ కోడి అరుపు వెనుక జాతి వ్యతిరేక కుట్ర దాగివుందని కొందరు భక్తులు బెంగటిల్లడంతో రసాభాస మొదలవుతుంది. పుకార్లు మొదలై ఒకరి నుంచి మరొకరికి పాకుతూ చివరకు 'నిజమై' కూర్చుంటాయి. కేవలం వినడమే గాని, ఎవరూ చూడని ఆ కోడి అరుపుతో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, బడిపిల్లలు, బడిపంతుళ్లు, అందరి పనులూ వ్యాపకాలూ, జాతీయగీతంతో సహా అన్నీ చిందరవందర గందరగోళమై పోతాయి.

మలయాళంలో కొన్ని సినిమాలకు మంచి స్క్రిప్టులు అందించిన మధుర కథకుడు ఉన్ని ఆర్ ఈ "కుట్రదారు కోడి" అనే చిన్న నవలతో ఆ భాషా సాహిత్యలోకం ఒక్కసారి ఉలిక్కిపడేట్టు చేశారు. జార్జి ఆర్వెల్ రాసిన 'ఏనిమల్ ఫామ్' నవలతో పోల్చదగిన ఒక రాజకీయ వ్యంగ్య నవలగా దీనిని రూపొందించారు. మనదేశంలో బుసలు కొడుతూ పెట్రేగిపోతున్న ఫాసిజపు వికృతరూపం ఛాయలను ఎండగట్టారు. ఫేక్ న్యూస్ దుర్గంధం, దాంతోపాటు మూక మనస్తత్వం విచక్షణరహితంగా విరుచుకుపడుతుండడం, అంతటితో ఆగకుండా.. వారే తీర్పులిచ్చేస్తూ. ఆలోచనపరులను బలితీసుకోవడం మనం చూస్తున్నదే.

సమకాలీనతకు అద్దం పడుతూ రాసిన కథనంలో చెప్పని విషయాలను మనకు విడమర్చి చెప్పడానికా అన్నట్టుగా రియాస్ కోము చిత్రాలు నవలకు మరింత వన్నె తెచ్చాయి. ఈ నవల మాతృక మలయాళ భాషలో పదివేల కాపీలకు పైగా అమ్ముడైంది. ఇప్పుడు ఆలోచనపరులైన తెలుగు పాఠకులను సైతం తప్పక అలరిస్తుంది.

120 pages, Paperback

First published October 1, 2021

Loading...
Loading...

About the author

Unni R.

20 books196 followers
Unni is a short story writer and screen writer in Malayalam. He is known for his stories like Leela, Kottayam 17 etc.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
0 (0%)
4 stars
2 (100%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 - 1 of 1 review
Profile Image for Rahmanuddin Shaik.
95 reviews5 followers
December 20, 2023
కేరళలోని ఒక పట్టణీకృత గ్రామంలోని సామాజిక పరిస్థితులను గురించి చూపిస్తూ అక్కడి సామాజిక రుగ్మతల గురించి చర్చించారు రచయిత. అనువాదం పెద్దగా పొసగలేదు. మత్తై ని మతై అనటం లాంటి పంటి కింద రాళ్ళున్నాయి.
ఒక సాధారణ వ్యక్తి ఎవ్వరికీ ఏ అపకారం తలపెట్టని వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న ఒక చిన్న అక్రమాన్ని నిరసించినందుకు ఎదుర్కున్న పరిస్థితి గురించి కథంతా. చిన్న పుస్తకమే ఇట్టే చదివేయవచ్చు.
Displaying 1 - 1 of 1 review