రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి వ్యాపార పంటలు పండించి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని కోరుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రభుత్వ మొక్కటే కాదు. పురుగుల మందు కంపెనీల వాళ్ళు, ఎరువుల కంపెనీల వాళ్ళు కూడ అదే కోరుకుంటారు. హైబ్రిడ్ విత్తనాల తయారీదార్లూ కోరుకుంటారు. వీటి హోల్సేల్ డీలర్లు, రిటైల్ అమ్మకందార్లు, మార్కెట్లో సేర్లు, కమిషన్ ఏజెంట్లు కూడ కోరుకుంటారు. బోర్వెల్ కంపెనీల వాళ్ళు, రిగ్గులు తయారు చేసేవాళ్ళు, కరెంటు మోటార్లు, పైపులు తయారు చేసేవాళ్ళు కూడ కోరుకుంటారు. ఉత్పత్తి పెరుగుదల రేటు నాగరికత 'పురోగమనాన్ని సూచిస్తుందని నమ్మే సామాజిక శాస్త్రవేత్తలు సైతం కోరుకుంటారు. మార్కెట్ వర్ధిల్లితే అందరూ వర్ధిల్లుతారని నమ్మే ఆర్థిక శాస్త్రవేత్తలూ, ప్రపంచ బ్యాంకు పెద్దలూ కోరుకుంటారు. మండలానికొక ఇంజనీరింగ్ కాలేజి పెట్టి విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న విద్యావేత్తలూ కోరుకుంటారు. కడుపునొప్పి అంటే చాలు అపెండిసెక్టమీ నుంచి హిస్టరెక్టమీ దాకా ఏదైనా చేసేయడానికి రెడీగా తాలూకా కేంద్రాలలో సహితం కత్తులు నూరుకొని రెడీగా ఉన్న వైద్య నిపుణులూ కోరుకుంటారు. అర్బన్ మార్కెట్తో సంతృప్తి చెందక గ్రామాలవైపు ఆశగా చూస్తున్న టి.వి. కంపెనీల వాళ్ళు, ద్విచక్ర వాహన తయారీదార్లు మొదలయిన వారంతా కోరుకుంటారు.
పెట్టుబడులు పెరుగుతున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో చిక్కుకున్న రైతులు విజయవంతంగా బయటపడితే వీళ్ళంతా వర్ధిల్లుతారు. అపజయం పాలయితే రైతు మాత్రమే చస్తాడు