జంధ్యామారుతం-1, 2 భాగాలను దరిమిలా అందుబాటులోకి వచ్చిన కొత్త విశేషాలతో విస్తృతపరచి కలిపి, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందంల ముందుమాటతో... ఒకే సంపుటంగా వెలువరిస్తున్న నూతన ప్రచురణ ఇది.
* * *
"పెన్"టాస్టిక్‌గా రాసి, "ఫన్"టాస్టిక్‌గా తీసి, తెలుగు చిత్రరంగంలో చిరకీర్తి నార్జించిన జంధ్యాలకు, రచనాపరంగా, సంగీతపరంగా, దృశ్యపరంగా ఆయన సాధించిన విజయాలకు నిలువెత్తు నివాళి ఈ పుస్తకం.
జంధ్యాల దర్శకత్వం వహించిన 39 సినిమాల చిత్రకథ, నటీనటుల పూర్వాపరాలు, నిర్మాణంలో తమాషాలు, షూటింగ్ విశేషాలు, మెచ్చుతునకలైన డైలాగ్స్, పాటల పల్లవులు, స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్, చిత్ర జయపజాయల సమీక్ష....
ఇలా ఒక్కో సినిమా గురించి విశ్లేషిస్తూ జంధ్యాల దర్శకత్వ ప్రతిభను సంపూర్ణంగా ఆవిష్కరించిన ఈ పుస్తకం - తెలుగు పుస్తక రంగంలోనే ప్రప్రథమ ప్రయోగం!
* * *
"తెలుగు సినిమాలలో హాస్యం ఉన్నంతవరకు జంధ్యాల చిరంజీవే"
తెలుగువారికి దేవుడిచ్చిన సినిమా వరం జంధ్యాల గారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల తెరవెనుక సంగతులు, ముచ్చట్లే ఈ పుస్తకం. అందరూ చదవదగ్గ పుస్తకం! హాసం ప్రచురణలు ఇంకా ఇలాంటి పుస్తకాలు ప్రచురిస్తే బావుణ్ణు!
This book is for folks who love their comedy movies in Telugu language directed by the extremely talented and gifted Movie Director - Jandhyala.
It includes details on all of the 39 pictures that he directed with information on the star cast and the production team. It is sprinkled with sweet and cute moments from the making of films along with the everlasting comic scene dialogues from his movies.
A must read at least to reminisce the wonderful and talented director who churned out everlasting and ever enjoying comedy for us....