కష్టం వచ్చినా, ఆపదొచ్చినా దేవుడు ప్రతిసారి ప్రత్యక్షంగా తోడుగా నిలవలేకపోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఆ దేవుడు మనిషి రూపంలో నీతో తోడుగా ఉంటాడు. మనం గుర్తించాలి అంతే. నా ఈ ప్రయత్నం ...జీవితంలో ఆశ , నమ్మకం కోల్పోయిన ప్రతీ ఒక్కరికోసం. కష్టాల్ని దాటి నిలబడే దైర్యం కోసం. మీ మొహంపై ఒక చిరునవ్వు కోసం. మీకు కష్టం వస్తే మీ మనసులో గుర్తుచేసుకోను రెండు పదాలు నాదైతే చాలు అనేదే నా స్వార్థం. మీతో ఎవరూ లేరు అనిపించినప్పుడు, ఎక్కడో మీ బుక్ షెల్ఫ్ లో "నీకూ ఓ కృష్ణుడు ఉన్నాడు చూడు" అని గుర్తు చేయాలన్న ఆశ. మనకీ ఓ కృష్ణుడు దొరకాలి అని చెప్పాను కదా.... రండి నా ప్రయాణంలో నాకు దొరికిన కృష్ణుడిని మీకు కూడా పరిచయం చేస్తాను.
ఈ పుస్తకం ఒక వ్యక్తి యొక్క అనుభవాలు. వాటి గురించి సమీక్ష ఇచ్చి వారి అనుభవాన్ని అవమానించలేము.
రచయిత ఆలోచన విధానం, GOD మీద ఆయన డెఫినిషన్/understanding నా ఆలోచన నా understanding లాగానే ఉన్నాయి. అందువల్ల ఈ పుస్తకం లో ఉన్న philosophy నాకు match అయింది.
చాలా కాలం తర్వాత ఒక తెలుగు నాన్-ఫిక్షన్ పుస్తకం చదివాను. ఈ పుస్తకాన్ని ఎంచుకోవడం నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్స్‌లో ఒకటి. మహేష్ అన్న తన జీవితంలోని వాస్తవ సంఘటనలను రాసిన తీరు ఎలా ఉందంటే.. ఆయన నా ముందే కూర్చుని తన ప్రయాణాన్ని నాతో పంచుకుంటున్నట్లు అనిపించింది.
"మనకీ ఓ కృష్ణుడు దొరకాలి.. అందరూ ఈ పుస్తకం చదవాలి!"
భగవద్గీత జీవితానికి ఎలా తోడ్పడుతుంది అని చాలామంది చెప్పగా విన్నాను, కానీ ఈ పుస్తకంలో మహేష్ గారు అది తన జీవితాన్ని ప్రాక్టికల్‌గా ఎలా మార్చిందో చాలా అద్భుతంగా వివరించారు. కొన్ని చోట్ల కన్నీళ్లు ఆగలేదు, మరికొన్ని చోట్ల అది నన్ను బాగా ఆలోచింపజేసింది. మనం ఏదైనా బలంగా నమ్మితే అది మన జీవితంలో నిజమవుతుందని నేను నమ్ముతాను, ఆ ఫీలింగ్ ఈ పుస్తకమంతా కనిపిస్తుంది. మన కృష్ణుడు ఆయనను ఎలా నడిపించారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఖచ్చితంగా చదవాల్సిందే.
కొన్ని పుస్తకాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పుస్తకాల్ని మనం అంతగా ప్రేమిస్తాం. ఇది నాకు అలాంటి పుస్తకమే. ఇక చెప్పడానికి మాటలు లేవు. ముఖ్యంగా బుక్ ఫెయిర్‌లో మిమ్మల్ని కలిసి మాట్లాడటం ఈ పుస్తకాన్ని నాకు మరింత స్పెషల్ అండ్ మెమరబుల్‌గా మార్చేసింది. ఖచ్చితంగా ఈ ఏడాది నేను చదివిన బెస్ట్ బుక్స్‌లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది.
It has been a while since I read a non fiction book in Telugu and picking this up is one of the best decisions I have made. This book is filled with real incidents from Mahesh anna’s life, and the way he has written them made me feel like he was sitting right in front of me and sharing his journey personally.
Many people speak about how Bhagavad Gita helps in life, but in this book Mahesh garu beautifully explains how it practically transformed his own life. Some parts made my eyes tear up, and some parts made me think deeply. I strongly believe that if we truly believe in something, it manifests in our life. That exact feeling reflected clearly throughout this book. To understand how his Krishna guided him and shaped his journey, one must definitely read this book.
There will be some books about which we cannot say much because we simply love them so much. This is that kind of book for me. I have no more words to describe it.
Spending time with you at the book fair and talking with you made this book even more special.
This will definitely be one of my best read this year.