నాణాన్ని బొమ్మ వైపు చూసినా, బొరుసు వైపు చూసినా దాని విలువ మారదు.. కానీ మనుషులని మనం ఒక విధంగా చూసి.. ఉన్నట్టుంది వారిలోని ఇంకో కోణాన్ని చూడగానే వారి మీద ఉండే అభిప్రాయం లేదా విలువ ఎందుకు మారుతుంది..??
అలానే ఈ కథలో విజయ్ తనలోని సున్నితమైన కోణాన్ని తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి చెప్పినప్పుడు.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆ పరిస్థితులు తన జీవితంలో తెచ్చిన మార్పులు ఏంటి? అన్నింటిని తన ప్రేమ కోసం సంతోషంగా స్వీకరించిన విజయ్ కి ఆఖరికి మిగిలింది ఏంటి.. అన్నదే ఈ బొమ్మ బొరుసు కథ.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ పుస్తకం చూశాను. అట్ట పైన ఉన్న చిత్రం నచ్చి కొనటం జరిగింది. రచయిత గారిని కలిసి వారి సంతకంతీసుకొని ఇంటికి రాగానే చదివేసాను.
చదివినంత సేపు ఇది సినిమా గా తీస్తే బాగుంటుంది అని అనుకుంటూ చదివాను. ఎన్నో పుస్తకాలు సినిమాల అనుభవం ఉన్నా కూడా తరువాత ఏం జరుగుతుందో ఊహించలేకపోయాను. కానీ ఆశ్చర్యాన్ని అందించింది మాత్రం ముగింపు. అది మన ఊహకి అందనిది. నిజానికి ఇందులో తప్పు ఎవరిది అనేది చెప్పలేము. ఒక ప్రముఖ సినిమా లో చెప్పినట్టు “హీరోలు విలన్లు లేరు ఇందులో..”
శ్రీనిధి పాత్ర ఇంకొంచం struggling చూపిస్తే climax లో ఇంకొంచం justification చేయొచ్చు. లక్కీ విజయ్ లు శ్రీనిధి ఎలా దగ్గరయ్యారో చదవండి. విజయ్ పేరును వాడటం ఒక successful diversion (చదివాక అర్ధం చేసుకుంటారు).
కానీ ఒక క్లిష్టమైన సమస్యని ఒక క్లుప్తమైన కథ లో ముగించిన విధానం నాకు నచ్చింది అనవసరంగా ఎక్కువ pages తీసుకోకుండా తొందరగా ముగించడం రచయిత తీసుకున్న మంచి నిర్ణయం.