డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు, కవి, పరిశోధకుడు.సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయిత[1] రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపిక అయ్యారు[2] . రాష్ట పతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిథిగా వీరు విడిది చేశారు.కేంద్ర సాహిత్య అకాడెమీ వారి 'రైటర్స్ ట్రావెల్ గ్రాంట్' ప్రోగ్రాం ద్వారా విశ్వ కవి రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతిని పురస్కరించు కొని 2011, ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేది వరకు ' శాంతి నికేతన్ 'లో పర్యటించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ మొదటిసారిగా 'లక్షద్వీప్' లో ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమానికి తెలుగు సాహిత్యకారుడిగా హాజరయ్యారు. వీరి' పాపాఘ్ని కథలు ' కడప ఆకాశవాణి కేంద్రం నుంచి ధారావాహిక గా ప్రసారమయ్యాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం ఎం.ఏ విద్యార్థులకు వీరి నవల' నేల దిగిన వాన' పాఠ్యాంశంగా నిర్దేశించారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా వెలువరించిన ఒకటి నుంచి ఆరు తరగతుల తెలుగుపాఠ్యపుస్తకాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు.