గత శనివారం, నేను న్యూ విశాలాంధ్ర బుక్స్టోర్కి వెళ్ళాను. ప్ర్రాప్రెటోర్ గారు సహపాఠకుడికి ఈ పుస్తకం చూపిస్తూ, చాలా బాగుంటదని ప్రశంచిస్తుంటే నేను కూడా ఆ ఫుస్తకం చదవాలని ఇతర పుషకాలతో పాటు ఆ పుస్తకం కూడా కొనుకున్న. ఇంటికి వచ్చాక, కొన్న పుస్తకాలు చూస్తూ మురిసిపోతు, కొంత సమయం కాలక్షాపం చేసాక, ఈ పుస్తకం చదవడం మొదలు పెట్టాను. ఈ పుస్తకం సుమారు వంద పేజీల చిన్న నవల. ఆ వంద పేజీలలో గుండెను పిండి, కళ్ళలో కన్నీళ్లు తేగలిగినంత బావాలున్న కథ. ఇది రెండు జీవుల మైత్రి కథ. ఒక మనిషి, ఒక అడవి జంతువు కథ. మనిషి జంతువు మధ్య బేధం చెరిపిన కథ. భేదం చెప్పిన కథ కూడా. అడివి జంతువు వన్యత కోల్పోయిన కథ. మనిషి మానవత్వం కోల్పోయిన కథ. చివరికి ఎవడు మనిషి? ఎవడు మృగం? అని ప్రశ్నించిన కథ. ఈ కథలో మనుషులు ఇమామ్, అతని భార్య మరియు కుమారుడు చంద్. అడివిజంతువు షాదుల్ అనే ఎలుగుబంటి. ఈ కథలో రెండు భాగాలుంటాయి. ఒకటి షాదుల్ని ఇమామ్ కుటంబంలో చేర్చుకునేందుకు చేసే ప్రయత్నం. ఇంకోటి ఇమామ్ కుటుంబం షాదుల్ని తమనుండి వదిలించుకోవడానికి చేసే ప్రయత్నం. ఈ రెండు ప్రయత్నాలు ముఖ్యంగా ఆర్దిక అవసరకోణంలో సాగేవి. అయినా మనిషిలో వున్న ప్రేమ, ఆప్యాయతలు అడివి జంతువులో వున్న అడవితనం తుడిచేసి, మచ్చిక చేసుకొని, మనుషులలో ఒక్కడిగా చేర్చుకున్నాయి. మారుతున్న ప్రపంచం తెచ్చిన సామాజిక, ఆర్థిక ఒత్తిడిలతో ఓడిపోయిన మనిషిలో ప్రేమ ఆప్యాయతలు, నశించి, చచ్చి కాలిన బూడిదలో పుట్టిన స్వార్ధానికి బానిసై మనిషి మృగమై క్రూరత్వం చూపించాడు అనడానికి నిదర్శనం పెద్దింటి అశోక్ కుమార్ రచించిన జిగిరి.
*చదివినవారు అక్షరదోషాలుంటే సరిచేస్తారని మనవి.