అతను జాహ్నవి ముఖాన్ని రెండు చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళు మీద, చెంపలమీద, పెదవుల మీద గాడంగా చుంబించ సాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది.
"జానూ నా కెవ్వరూ లేరు. నా కెవ్వరూ లేరు !నేను ఒంటరి వాడిని నన్ను నీవాడిని చేసుకో ! నీ సొంతం చేసుకో !నీ ప్రేమ ప్రవాహంలో ముంచేయి . ఇది నాకిస్తే నీను నీకు ఏమి ఇస్తానో తెసుసా ! అందమైన ఇల్లు చక్కటి పిల్లలు, ప్రశాంతమైన జీవనం . వాటితో కలిపి నన్ను నేను నీకు అర్పించుకుంటాను. జానూ ! నేను నీ వాడినని చెప్పు రవీ జానూ చెప్పు నేను నీ దానిని రవి
.. అతను చిన్నపిల్లాడిలా ఆమె నడుము చుట్టూ చేతులు పెనవేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని పెదవులు ఆమె తాకుతూ అంటున్నాయి..
జాహ్నవి ఓ సైకియాట్రిస్ట్ పిన్నీ బాబాయిల దగ్గర పెరిగింది. శివ శంకరం కొడుకు రాజా. వారిది బాగా కలిగిన కుటుంబం. అయితే రాజా హోమో సెక్సువల్ అవుతాడు. అక్రమ సంబంధం వాల్ల పుట్టిన వాడన్న అనుమానంతో తండ్రి శివ శంకరమే రాజాను కడతెరుస్తాడు.
అచ్చు రాజా పోలికలతో ఉండే రవి రాజా స్థానం లోకి వస్తాడు. జాహ్నవి రవిని ఇష్ట పడుతంది. ఇంతకీ రవి ఎవరు ? రాజా హత్య కేసులో జహ్నావి సంపాదించిన కీలక ఆధారాలేమిది ? రాజా హంతకుడిగా అరెస్టయిన రవి బయటపడ్డాడా ? ఊహించని మలుపులతో సైకియాట్రి నేపధ్యంలో చక చకా సాగిపోయే యద్దనపూడి సులోచనారాణి నవల...
Yaddanapudi Sulochana Rani (యద్దనపూడి సులోచనారాణి), is a renowned Telugu novelist. She was very popular among the ladies and younger generation with her fiction novels based on love stories and drama, with a great fan following during the 1970s and early '80s. Many of her stories were made into movies in Telugu language as well.