Note: Before marriage, RN used her maiden surname ‘Daddanaala Ranganayakamma’ in her works, and after the marriage, she adopted the surname ‘Muppala’ as was the convention. After the separation, she stopped using the adopted surname and began to write without any surname: simply as ‘Ranganayakamma’
రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.
రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.
రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.
చుట్టాలు అనె ఈ నవల లొ రంగనాయకమ్మ గారు ఒక సున్నితమైన విషయాన్నితీసుకొని ఆ కాలపు మనుషల స్వభావాన్ని, వారి సమస్యలని చాలా స్పష్టం గా వివరించారు. మనుషులు అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని,వీడి ఎదుటి వారి కష్టం అర్థం చేసుకుని, సహాయపడాలని చక్కటి సందేశమిచ్చారు.