మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి. లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు - పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ్చ్కోవటానికి పెనుగులాడుతున్నాడు... జమున గబ గబా గది తలుపులు తెరిచింది. ప్రసన్నా ! ప్రసన్నా ! అంటూ పరుగెత్తుకెళ్ళి అతడి చేతులకి కట్టిన కట్లు విప్పింది. అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది. నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిఎది ? ఆ పని కుర్రాడు, ఆ రాస్కెల్ - ఆవేశంగా అంటోంది. కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు. అతని శరీరం నిటారుగా అయింది.జమునని చూడగానే అతడు పళ్ళు బిగించాడు. అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి.... ప్రసన్న గతం అతణ్ణి వెన్నాడింది. ఇష్టపడి చేసుకున్న శోభ తన అనైతిక ప్రవర్తనతో ప్రసన్నకు మనశాంతి లేకుండా చేసింది. అయితే జమున అతడికి చేరువ అవుతుంది. ఆమె అందరిలాంటిది కాదు ఆమె వ్యక్తిత్వం ప్రసన్నను ఆకర్షిం చింది . కొందరి ఆగమనం ఆనంద శిఖరాలకి చేరిస్తే, మరికొందరి ఆగమనం పతనపు లోయలలోకి తోసేస్తుంది. జమున ఆగమనం ప్రసన్న జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? యద్దనపూడి సులోచనా రాణి అధ్బుత పరిశీలనాత్మక నవల.
Yaddanapudi Sulochana Rani is a renowned Telugu novelist. She was very popular among the ladies and the younger generation for her novels about love and drama, with a great fan following during the 1970s and early ’80s. She used to have a strong inclination towards literature from her childhood. She has written over 80 novels. Several of her stories were made into films and television serials. She won two Nandi Awards. Yaddanapudi died of a heart attack on 18 May 2018 in California, U.S., while visiting her daughter.
Chaala మంచి స్టోరీ.ఇది స్వార్థం లేని స్నేహానికి ఒక నిదర్శనం. ప్రసన్న ఒక మంచి మిత్రుడు జమున కి. సిద్దార్థ జైల్ కి వెళ్ళినప్పుడు జమునకి సాయంగా అండగా ఉంటాడు.లోకం ఏమన్నా పట్టించుకోకుండా ఇద్దరు కలిసి జీవితం ను ముందుకు తీసుకుని వెళ్తారు. దీపు జమున కొడుకు. తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియని వయసు నుండి జమున దగ్గర పెరుగుతాడు. Sudden ga సిద్దు నీ చూపించి ఈయనే నీ తండ్రి అంటే సిద్దు అవతారం చూసి బయపడి అసలు నా తండ్రి కాదు అని దూరంగా వుంటాడు. ఇన్ని సమస్యలలో కూడా సహనం చూపిస్తూ వీటన్ని కి ఎదురు నిలుస్తూ పోరాడుతుంది జమున. తను ఈ సమస్యలను ఎలా ఎదుర్కుంటుంది అనేదే ఈ aagamanam''