కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనేక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు,మనోప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ‘రాముడుండాడు రాజ్జిముండాది’ అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు.
‘రాముడుండాడు రాజ్జిముండాది’ అని వలసల విషయంలో ప్రజలకేర్పడిన భారోసలోనే ఈ పరిణామం లోని రహస్యం ఇమిదిఉన్నది. దేశం గోద్దుబోయిందా, ఇంత సువిశాల దేశం ఇది –బతకకపోతామా అని బయల్దేరలేదు వారలు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి యంత్రాలు, మార్కెట్ వచ్చాక రాజ్యం (ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి పర్యాయపదం) జీవనోపాధి కలిగిస్తుందనే ఒక ఎండమావి ఏర్పడింది. పుట్టిచినవాడు రాతి కింద కప్పకు కూడ బతుకు దెరువు చూపకపోడనే విశ్వాసం మత శాస్త్రాలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పోసినదే. కనక రాముడూ రాజ్జీవూ కలసి పోయాయి. బ్రాహ్మణీయ హిందూ మత విశ్వాసం కలిగించిన మాయకు మార్కెట్ మాయతోడైంది.
Dr. Kesava Reddy was a renowned Telugu novelist.[1] Hailing from Andhra Pradesh state in India. In his writings, he addresses many of the important social problems in India like poverty, prejudices, and superstitions, and encourages people to be socially responsible. He successfully bridges the idealistic and popular styles of literature.
Kesava Reddy was born in Thalapula Palli, Chittoor District, Andhra Pradesh to Ranga Reddy P, a farmer. He did his early education at S.V University, Tirupathi. He obtained his MBBS degree from Pondicherry University, and his pg diploma in dermatology in CMC medical college, Vellore. Reddy worked as a medical officer in Victoria Hospital, Dichpally, Nizamabad. He later retired and settled in Nizamabad town.
ఇప్పటి వరకూ నేను చదివిన అన్ని కేశవ రెడ్డి నవలలతోటి పోలిస్తే ఇది చాలా బిన్నమైనది. ఇందులో particular గా protagonist అంటూ లేడూ. ఇది ఒక ఊరి కథ. ఒక ఊరిలోని వివిధ కులాల వారు, వారి వారి కుల వృత్తులలో స్వాతంత్ర్యం అనంతరం ఎదురుకొంటున్న ఇబ్బందులను, సాంఘిక సమస్యలను మనకి తెలియజేసే కథ. ఈ నవల చదువుతున్నంత సేపు పాఠకులకు ఏదో తెలియని చింత మరియు అసహనం కలగక మానదు.
For a change, కేశవ రెడ్డి గారి focus ఈ కథలో కేవలం ఒక వ్యక్తి మీద కానీ లేదా ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల అనంతరం మారిన అతడి జీవన గమనం మీద కానీ ఉండదు. అంటే ఉదాహరణకి కథలోని పాత్రలు తమ ఊరు విడిచి పట్టణం వెళదామని నిర్ణయిస్తారు. అయితే ఈ కథ వాళ్ళు పట్టనముకి వెళ్ళాక అక్కడ వారు ఎదురుకొనే ఇబ్బందుల గురించి ఉండదు, అలా ఊరు విడిచి పెట్టాలని వాళ్ళు ఎందుకు నిర్ణయించుకున్నారు మరియు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే అంశం పైన ఉంటుంది. ఆనాటి పరిస్థితులనీ, వాటికి అనుగుణంగా మారిన మనుషుల ఆలోచనా విధానాన్ని మన కళ్ళకి కట్టినట్లు గా చూపించడం లో కేశవ రెడ్డి గారు సఫలీకృతులయ్యారు.
If you get a chance to read an educated take on the issues like this, don't miss it. Don't miss Keshava Reddy.
కేశవ రెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనిఎక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాల నుండి వలసపోతున్న కులవృత్తుల వారి జీవితాలు ఆలోచనలను వివరించారు.. నానాటికి వలసిపోతున్న పల్లె బతుకులను వలసపోలేక ఛిద్రమవుతున్న చిన్నజీవితాలు దీనగాథను కేశవరెడ్డి గారి తనదైన శైలిలో వాడుకభాషలో ఎంతో సరళంగా వివరించారు