నాకు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే అసహ్యం. దానిని మానవ జాతి ఏ విధంగా అధిగమిస్తుందో ఎవ్వరికీ తెలీదని నేను అనుకుంటున్నాను. మార్క్సిజం పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించడానికి పనికి వచ్చినంతగా దానిని అధిగమించడానికి పనికి రాదని ఈ శతాబ్దం చరిత్ర రుజువు చేసిందని నా అభిప్రాయం. అది ఏ విధంగా జరగగలదో అర్థం చేసుకోవడానికి మూలాల నుండి పునరాలోచించాలని నేను అనుకుంటున్నాను. దీనికి జవాబు దొరుకుతుందని హామీ ఏమీ లేదు. అయినప్పటికీ అన్వేషణ జరపవలసిందే.
పెట్టుబడిదారీ వ్యవస్థతో సరిపెట్టుకోవడం అంటే మానవ జీవితాన్ని అనైతిక స్థాయిలో ఉంచి వేయడమే. మనుషుల మధ్య 'ఉపయోగం' అనేది తప్ప వేరే విలువలేవీ లేని జీవితంతో సరిపెట్టు కోవడమే. ఇది తగదని నా అభిప్రాయం - కె. బాలగోపాల్
ఈ పుస్తకం చదవడం నాకొక రాజకీయ శిక్షణ అనిపించింది. మొదటి వ్యాసం మొదటి పేజీలో బాలగోపాల్ గారు ఒక ప్రశ్న వేశారు: *నువ్వు 20వ శతాబ్దపు సోషలిజం వైఫల్యాలను చూసి ఆనంద పడుతున్నావా, లేక బాద పడుతున్నావా?* అని. ఆనందపడేవాడివి అయితే ఈ పుస్తకంలోని మిగతా వ్యాసాలతో నీకు పని లేదు. బాద పడినట్టయితే తప్పక చదవాలి.
ఎందుకు బాద పడాలి? ఎందుకంటే పూర్తి పెట్టుబడిదారి వ్యవస్థ మనకి (ఇతర ప్రాణులకి కూడా) అంత మంచిది కాదు కాబట్టి. “అదేంటి? పెట్టుబడీదారి వ్యవస్థే కదా ఎక్కువ పేదరికం నిర్మూలించింది” అని మీరు బదులు ప్రశ్న వేయచ్చు. వెయ్యాలి కూడా. అది నిజమే కాబట్టి. పెట్టుబడిదారి వ్యవస్థ మారాలి అంటే దానివల్ల జరిగిన ఎలాంటి మంచిని గ్రహించకూడదు అనే చాదస్తపు వాదన కాదు బాలగోపాల్ గారు చేసింది. అందులో ఉన్న మంచిని స్వీకరిస్తూనే, చెడుని గ్రహించాలి. దానికి మనం హేతుబద్ధంగా ఆలోచించాలే కానీ ఏదో ఒక భావజాలంలో పడి ఆలోచించకూడదు అనేది ఈ వ్యాసాల ప్రధాన సందేశం.
ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో చెడును గ్రహించేందుకు మార్క్సిజం ఎక్కడెక్కడ పనికొస్తుందో సూక్ష్మంగా పరిశీలించారు. పెట్టుబడిదారి చేసే శ్రమదోపిడీ, వ్యాపారీకరణ (commodification) మొదలైన ఆర్ధిక విశ్లేషణ మార్క్సిజం చాలా బాగా చేసిందని కితాబిచ్చారు. అక్కడితో ఆగకుండా పెట్టుబడిదారి వ్యవస్థను పర్యావరణం, అస్తిత్వం కోణాల్లో కూడా విమర్శించి అందులో ఉన్న చెడు లక్షణాలను మరికొన్ని వెలికి తీశారు. నాకు బాగా నచ్చిన విమర్శ: **“పెట్టుబడిదారి వ్యవస్థ ప్రపంచాన్ని ఒక భోజ్య వస్తువులా చూపిస్తుంది”** అనే వాక్యం. ఈరోజు మనం అనుభవిస్తున్న చాలా సమస్యలు ఈ వాక్యం ద్వారా పరిశీలించచ్చు అనిపించింది. రేపంటూ ఒక రోజు ఉందని మరిచిపోయి విచ్చలవిడిగా చేసే కాలుష్యాన్ని , విధ్వంసాన్ని ఈ వాక్యం వివరిస్తుంది. మరొక వాక్యం కూడా బా నచ్చింది: **“పెట్టుబడిదారీ వ్యవస్థతో సరిపెట్టుకోడం అంటే మనుషుల మధ్య ‘ఉపయోగం ‘ తప్ప వేరే విలువలేవీ లేని జీవితంతో సరిపెట్టుకోవడమే”**
కానీ ఈ వ్యాసాల ప్రధాన లక్ష్యం - పట్టుబడిదారి వ్యవస్థలో చెడును చూపించగల మార్క్సిజంలో నూతన సమసమాజ నిర్మాణం కొరకు ఉన్న ఆలోచనల్లో ఉన్న లోపాలను పరిశీలించడం. ఈ పరిశీలన చాలా గొప్పగా చేశారు అనిపించింది.
మార్క్సిజం సైన్స్ అని అంటారు మార్క్సిస్టులు. హోమియోపతి వాళ్ళు కూడా అంటారు హోమియోపతి సైన్స్ అని. మా గ్రంథాల్లో అంతా చక్కగానే ఉంది మనుషులకే ఆచరణ రావడం లేదు అని మత ఛాందసులు వాదిస్తారు. అలా ఎలా అని ప్రశ్నిస్తే "ముందు మా రచనలు చదవండి లేకపోతే మీ విమర్శ సరైనది కాదు" అంటారు. ఈ వాదన అసలు సరైనదే కాదు. ఎవరైతే ఒక సిద్ధాంతాన్ని సైన్సు అంటున్నారో, అది సైన్సు అని నిరూపించే బాధ్యత వాళ్ళమీదే ఉంటది అన్నది శాస్త్రీయ దృక్పదం. అయినప్పటికీ బాలగోపాల్, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు మార్క్సిజంలో మునిగి తేలిన తరువాతే అది శాస్త్రీయం కాదు అని అన్నారు. అలా అని మొత్తం కొట్టి పారేయలేదు. మార్క్సిజంలో కొన్ని సిద్ధాంతాలు హేతుబద్ధంగా ఉన్నాయని, కొన్ని లేవని విడగొట్టి పరిశీలించారు. ఈ పరిశీలనలో ఎలాంటి తప్పు కనిపియ్యడం లేదు నాకు.
మార్క్సిజం వేరే శాస్త్రీయ శాకల నుంచి నేర్చుకోడానికి చాలా ఉంది. బాలగోపాల్ తరచుగా మానసిక శాస్త్రం నుంచి మార్క్సిజం నేర్చుకోవాలి అని అన్నారు. దానికి ఎరిక్ పఫ్రామ్ అనే మార్క్సిస్ట్ నాంది పలికినప్పటికీ పెద్దగా మార్క్సిస్టులు స్వీకరించలేదు. బాలగోపాల్ స్వయంగా చేసిన విమర్శలో మార్క్సిజం అంచనా వేసిన కొన్ని పరిస్థితులు ‘సరళ రేఖ’ లో జరగలేదని అన్నారు. ఒక విషయం జరిగే వెనుక రెండు మూడు అంశాలు ఉన్నాయని అనుమానం ఉన్నప్పుడు, ఏది అసలైన కారణమో తేల్చడం అంత సులువుకాదని. దానికి హేతుబద్ధత ఉండాలని. మార్క్సిజం చాలా విషయాల వెనుక భౌతికత్వమే కారణం అని త్వరగా తేల్చేసిందని ఆయన విమర్శించారు. ఇది గణాంక శాస్త్రం (statistics) నుంచి వస్తున్న విమర్శ: non-linearity, causality, “correlation is not causation” అని గణాంక శాస్త్రంలో తరచూ వింటూ ఉంటాము. ఈ విమర్శ చదివాకా ఒక గణాంకశాస్త్ర విద్యార్థిగా నాకు కుతూహులం ఎక్కువయింది. తీరా చూస్తే బాలగోపాల్ గారు PhD చేసింది Advanced Probability మీద అని, Indian Statistical Institute లో post doctorate చేశారని తెలిసింది!
చివరిగా చెప్పాలంటే, సమసమాజం నిర్మించడం మనందరి బాధ్యత. దీనికి సమాధానం ఏ ఒక్క భావజాలం గుప్పిటి లో లేదు. ఏ ఒక్క వర్గంలో లేదు. బాలగోపాల్ అన్నట్టు: **“చివరికి మనుషులు సమసమాజాన్ని కాంక్షించబోయేది కార్మికులుగా, ఆదివాసులుగా, స్త్రీలుగా, దళితులుగా కాదు; చైతన్యవంతులైన వ్యక్తులుగా”**
This book contains collections of his essays and writings over a period of time. He critically reviews the the various aspects of Marxism and the so called socialist experiments of 20th century like Bolshevism and Maoism in China broadly the communist movements in the world and also in Andhra Pradesh and clearly outlines the flaws in Marxist tradition one that is central to this book is the lack of understanding of what a Human being is and what is human Nature? and the subsequent mistakes that resulted from those shortcomings in Marxism and the communist movements overall. In his writings one can find a great deal of conceptual clarity and broad understanding of history and society in its transition. In conclusion he observes rightly according to me that socialism(a classless and stateless society where every individual has scope to enhance their capacities and to live a decent life with dignity) cannot be achieved through the working class taking over state power through a violent revolution(which occurs in a short time) and forcing the rest towards a socialist society but can only be achieved through democratic transition of society where not just domination of capitalists class power is challenged but also the other domination/authoritarian power structures such as caste and gender domination etc should be done. Although he believes that no one has a blue print to achieve socialism. Over all a this a great book and worthwhile reading to understand a man who for his entire time worked as a civil liberties and human rights activist in Andhra Pradesh. To know more about Balagopal and his work check this out. http://balagopal.org/ (less)