తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలతో అనిపించుకున్న భాష మన మాతృభాష...
అందగాలు, యుద్ధరంగంలో అరితేరినవాళ్ళు, అటు, పెటు(పెట్టు), రెటు(రెట్టు)అని మాట్లాడేవాళ్ళు ఆంధ్రులు అని ప్రాచీన ప్రకృత కవితో అనిపించుకున్న వాళ్ళు మన తెలుగువాళ్ళు...
అసలు మన భాష, మన ప్రాంతం ఎప్పటిది?? మన చరిత్ర ఏంటి?? ఇటువంటి ప్రశ్నలకి సమాధానం ఈ రెండు పుస్తకాలు...
ముందుగా సురవరం ప్రతాపరెడ్డి గారు రచించిన "సాంఘిక ఆంధ్రుల charitra". ఈ పుస్తకంలో రాజులు, రాజ్యాలు, రాజకీయాలు, యుద్దాల గురించి పెద్దగా ఉండదు.. కానీ, ఆ రాజ్యల సమయంలో, ఆ రాజుల అస్థానంలో తెలుగు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది?? మన ఆహార వ్యవహారాలు ఎలా ఉండేవి.. ఏ దేవతలని పూజించేవాళ్ళం... ఏ పండుగలు జరుపుకొనేవాళ్ళం లాంటి విషయాలు చాలా విపులం(Detailed)గా ఉంటుంది... అప్పటి శాతవాహనుల కాలం నుంచి 1905 వరకు జరిగిన సాంఘిక మార్పులు, బ్రిటిష్ వాళ్ళ పన్ను లెక్కలు అన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి..