Jump to ratings and reviews
Rate this book

బుచ్చిబాబు కథలు రెండవ సంపుటం [Buchibabu Kathalu Rendava Samputam]

Rate this book
నిజానికి పాఠకుడికి, కథ ముఖ్యంగాని, దాని వెనక ప్రేరణ శక్తులేవో, అది ఎందుకు ఎట్లా వ్రాయవల్సివచ్చిందో తెలుసుకోడం ముఖ్యం కాదు. తీరా చదివాక ఆ కథ నచ్చకపోతే, ఈ కథనం అంతా బడాయిగా కనబడి మరింత చికాకు పడొచ్చు. కథ నచ్చినట్లయితే మళ్ళా మళ్ళా చదవాలనిపిస్తే దాన్ని గురించిన వృత్తాంతం తెలుసుకోవాలనుకోడంలో ఆక్షేపణ వుండదనుకుంటాను. పాఠకుడికి కావల్సింది ఈ కథ కళానుగుణంగా తృప్తికరమైందా? ఇది సాహిత్యమా? అన్న ప్రశ్నలు. ఈ కథలు తృప్తికరంగా లేకపోతే, అందుకు కొంత బాధ్యత రసెల్‌పై వెయ్యవద్దని కోరుతున్నాను. నేను మొదట్లో చెప్పినట్లు నన్ను కొన్నాళ్ళుగా కలవరపెట్టిన కొన్ని భావాలు, రసెల్‌ వ్యాసంలో తటస్థపడ్డాయి - మందుగుండు సామాగ్రి సిద్ధంచేస్తే నిప్పుపుల్ల వేసినట్లు నిప్పుపుల్ల గీసినా ఆ మందు కాలకపోతే మందు తయారీలో లోపంకాని, అగ్గిపుల్లదికాదు. అగ్గిపుల్లకూడా కాలకపోతే, పాఠకుడు ఎంత నిరాశ చెందుతాడో ఊహించగలను. అట్లా నిరాశ చెందకుండా వుండేటందుకు ఈ రెండు మాటలూ తోడ్పడితే తృప్తి పడతాడు. - బుచ్చిబాబు

559 pages, Paperback

Loading...
Loading...

About the author

Butchi Babu

6 books35 followers
Butchi Babu was the pen name of an eminent Telugu short story writer, novelist and painter. His real name was Sivaraju Venkata Subbarao.

నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే యత్నం చేస్తాను. ప్రతి రచయితా తన రచనపట్ల అభిరుచి తనే ప్రయత్నపూర్వకంగా కలగచెయ్యాలి. నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకి గురవుతాడు. తాను కోరిన ఉద్యోగం దొరకదు, ప్రేయసి దొరకదు, స్నేహితులుండరు. తాను ఆరాధించిన ఆదర్శశిఖరాలు కూలిపోతూ వుంటే చూస్తూ ముక్కు మీద వేలేసుగుని కూర్చంటారు. బాల్యంలో తన కేవో పేచీలు, బాధలు ఏర్పడతాయి. ఒక సంఘర్షణ ప్రబలి, ద్వంద వ్యక్తిత్వం ఏర్పడి యీ బాధని ఇతరులతో చెప్పుగుని విముక్తుడవుతాడు. ఆ సంఘర్షణ నిలిచి, ద్వంద వ్యక్తిత్వానికి సమన్వయం కుదిరి, ఏకత్వం సాధించినవాడు అతను యోగి - ఇంక వ్రాయడు. ఈ గొడవ విని, యీ బాధని పంచుకోడానికి సిద్ధపడే పాఠకులు ఏ వొకరిద్దరో వుంటారేమో. ఒక్కడు వున్నా ఆ కథకుడు ప్రయోజనం సాధించి చరితార్ధుడైనట్లే భావిస్తాను.

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
2 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.