ఎన్నో యేళ్ల అనుభవం, అధ్యయనం, ఆలోచన వుంటే తప్ప ఇలాంటి నవల రాయడం సాధ్యం కాదు. చరిత్రని తవ్వడం ఒక యెత్తు అయితే, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా పతిబింబించడం ఒక యెత్తు. ఉత్తర ఆంధ్రా ప్రాంతంలో అప్పుడప్పుడే విద్యావ్యవస్థ గ్రామాల్లోకి పాకుతున్న నేపథ్యంలో దళితులు ఎదుర్కొన్నటువంటి కని విని ఎరుగని ఎన్నో రకాల సమస్యలని పూసగుచ్చినట్టు బహిర్గతం చేశారు రచయిత బొజ్జా తారకం గారు.
నిజంగా ఒక మంచి రచయిత తన మనసులో ఎమనుకుంటున్నాడో ఉన్నది ఉన్నట్లుగా రాస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఈ నవల చదువుతుంటే అనిపించింది, ఏవో రూల్స్, ఎథిక్స్, పాఠకుల సెన్సిబిలిటీస్ వగైరా అడ్డంకులు లేకపోయి వుంటే ఇంకా ఎంత రాసేవారో రచయిత? ఈ నవల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన పరి భాషలో చెప్పాలంటే.... ప్రతి పేరాగ్రాఫు మైండ్ పోతుంది లోపల 🔥