కొమ్మూరి సాంబశివరావు ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పని చేసారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులు ఉండరు. ఈ పాత్రలను సృష్టించిన రచయిత, తెలుగులో తోలి హారర్ నవలా రచయిత కూడా కొమ్మూరే.