శాస్త్రి గారు కాశ్మీర్ సమస్య పై రాసిన వ్యాసాల సేకరణ ఈ పుస్తకం. కాశ్మీర్ విలీనం నుంచి 2002 లో పార్లమెంటు దాడి తరువాత వరకు జరిగిన కాశ్మీర్ యొక్క రాజకీయ సామాజిక గాథ. ఈ ఉత్కంఠ భరితమైన వ్యాసాలలో, పాలనా వర్గాలు స్వయంకృతంగా కాశ్మీర్ లో ఇంత విషమ పరిస్థితిని ఎలా తీసుకువచ్చారో మనము తెలుసుకోవచ్చు.
పుస్తకం ఆఖరిలో, ఐదు వేల సంవత్సరాల కాశ్మీర చరిత్రని చాలా సంక్షిప్తంగా స్పష్టతనిచ్చేలా చూపిస్తూ రెండు వ్యాసాలున్నాయి. కాశ్మీర్ లో ఇస్లామిక్ సమస్య అర్థం చేసుకోవడానికి ఆ చారిత్రక నేపథ్యం చాలా అవసరం.