మన దేశంలో "సెక్యూలరిజం" అనేది ఒక నిరర్థకమైన పదం. హిందువుల పట్ల ఉదాసీనత దుర్వివక్ష లేదా వ్యతిరేకత, ఇంకా దానికి తోడు "మైనారిటీలను" మతోన్మాదులు దేశ విచ్ఛిన్న శక్తులను పోషించడమే మన దేశంలో సెక్యులరిజం. మన రాజ్యాంగలోనే ఉన్న మౌలిక లోపాల వళ్ళ హిందువుల అస్తిత్వానికే ప్రమాదకరమైన ఈ దుస్థితి ఎలా ఏర్పడిందో మన కళ్ళకి కట్టినట్లు గా చూపించారు శాస్త్రి గారు. మన రాజ్యాంగంలో 25 నుండి 30 వరకు ఉన్న "మైనారిటీ" లకు ప్రత్యేక ప్రతిపత్తుల నిచ్చే అధికరణాలు, స్వతంత్ర భారతంలో వీటికి సంబంధించి జరిగిన వాజ్యాలు సంఘటనలను సమగ్రంగా పరిశీలించి రాసిన పుస్తకం ఇది.
అసలు మతానికి సంబంధం లేకుండా దేశంలో ఉన్న పౌరులందరిని సమానంగా రక్షించాలనే రాజధర్మం కలిగిన దేశం మనది. అందుకే "సెక్యులరిజం" "మైనారిటీ" అనే పాశ్చాత్య భావనలకు ఇక్కడ అసలు అవసరమే లేదు. కానీ రాజ్యాంగంలో "మైనారిటీ" అనే పదం వాడి వాళ్ళకే అన్నట్టుగా ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం వళ్ళ, ఆ "సెక్యులరిజం" పాలనవర్గాల చేతులో హిందువుల పట్ల దుర్వివక్ష కి, హిందూద్వేషులు జాతిద్రోహుల చేతిలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడే ఒక పరికరంగా మారింది.
హిందుత్వం రక్షణ కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసి, మన ఆలయాలని ప్రభుత్వ పెత్తనం దోపిడీల నుంచి విముక్తి చెయడము, ఇంకా మన విద్యా వ్యవస్థ ని మెకాలే కమ్యూనిస్టుల భావజాలం నుంచి విముక్తి చేసి భారతీయకరణ చేయడం చాలా ముఖ్యం.
మన దేశం లో "సెక్యులరిజం" పేరున జరిగే హిందూ వ్యతిరేకత. హిందువుల పట్ల, మన సంస్కృతి మీద జరిగే దాడులు దుర్వివక్ష గురించి తెలుసుకోవడానికి ప్రతి భారతీయుడు చదవవలసిన పుస్తకం.