మూడవ శాతవాహన రాజు శ్రీ శాతకర్ణి, ఆయన పత్ని మహారఠి వంశానికి చెందిన మహారాణి నాగనిక ధాన్యకటకం (నేటి అమరావతి) రాజధానిగా పకిపాలించిన కాలం నేపథ్యంలో ఈ నవల రచించబడింది. ఆ క్రీ.పూ. 2'వ శతాబ్దపు సమయంలో కళింగ దేశంలో ఖారవేలుడు, పాటలీపుత్రంలో శుంగ వంశ పరిపాలన జరిగేది. శాతవాహన సేనాధిపతి విజయదత్తుడు, ఒక బౌద్ధ భిక్షుకి శ్రీలేఖ ఈ కథలో ముఖ్యమైన పాత్రలు వహిస్తారు. తరువాత ఏమి జరుగుతుంది అనే కుతూహలం, ఉద్విగ్నత ఎక్కువగా లేకపోయినప్పటికిీ ఇది ఒక ఆశిక్తికరమైన కథనం. ఇది ఒక వర్ణనాత్మక రచనా శైలిలో రాయబడింది. సరళ భాష తో మన ముందు దృశ్యాలు ఏర్పడే పదచిత్రం. అప్పటి చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందిన కథ ఇది. మన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యంగా ఆంధ్ర సంస్కృతి ని మన స్మృతిపథానికి తెస్తుంది. ఒక రసవత్తరమైన చారిత్రక గాథ.
శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి అద్భుత చారిత్రిక నవల శ్రీలేఖ.క్రీ. పూ.200 సంవత్సరాల పూర్వం నేటి అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల కథ. అప్పటి భారతీయ సంస్కృతినీ, ప్రత్యేకించి ఆంధ్ర సంస్కృతినీ ఆ వైభవాన్ని సరళ మయిన భాషలో మన కళ్ళకు కట్టినట్లుగా రచించారు శ్రీ శివప్రసాద్ గారు.విజయదత్తుడు, శ్రీలేఖ మరియూ నాగవరదాయిని వంటి పాత్రలు మరిచిపోలేని.