అమెరికాను దులిపేసినంత జోరుగా అంబాజీపేట గురించి మన కలాయుధులు రాయరు. అలా కాకుండా మన సీమ, మన నాయక వినాయకులు, మన మఠాధిపతులు, అధికార మదాధిపతులు - ఇలా ఎందరితోనో. చెలగాటాలాడి నవ్వుతూ నవ్విస్తూ ఏడిపించటమే ఈ వీక్ పాయింట్ యొక్క స్ట్రాంగ్ పాయింట్ - అన్నాడు ముళ్ళపూడి వెంకట రమణ ఈ పుస్తకం ముందుమాటలో. ఆంధ్రభూమి దినపత్రికలో 15 ఏళ్ళుగా ప్రతి శనివారం పాఠకులు ఉత్కంఠతో ఎదురుచూసే పాప్యులర్ కాలం వీక్ పాయింట్ నుంచి ఎంపిక చేసిన వ్యాసాల తొలి సంపుటమిది. మలి సంపుటం త్వరలో రానున్నది.