Jump to ratings and reviews
Rate this book

భర్తృహరి చరిత్ర -శతక త్రిశతి

Rate this book
ఇటీవల సుభాషిత త్రిశతి ముద్రణములు ఆంగ్ల వ్యాఖ్యాభాషాంతరీకరణములతో నెన్నో వెలువడినవి. వానిలో ముఖ్యమైన ఆంధ్రానువాదకులలో ఏలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి యనువారు ముఖ్యులు. వీనియన్నింటికన్నా మిన్నయై రచించినట్టిది భర్తృహరి శతక సాహిత్య సాహిత్యం. దానిని విశ్వవిఖ్యాత గ్రంథకర్త శివకిషెన్ జీ,రచించిన ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి.
భర్తృహరి శ్లోకాలు రాని వారెవరూ ఉండేవారు కారు. ముఖ్యంగా నీతిశతక పద్యాలు బోధనా అంశాలు గా ఉండేవి .సరళంగా, గంభీరంగా భావసంపదతో రాణిస్తాయి. ఇలాంటివి అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుకోవటం అవశ్య కర్తవ్యం.
భారతీయ జీవన విధానం, నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రజలకు మంచి నడవడిక నేర్పేందుకు దోహదపడేది భర్తృహరి చరిత్ర -శతక త్రిశతి. యందలి శ్లోకములన్నియు అనుభవజ్ఞానముతో చెప్పినట్లు పాఠకుల హృదయాలలోనికి సూటిగా పోయి వారిని సంస్కరించుటకు అనుకూలములై యున్నవి. ఎందుకంటే వారు మానవుల స్వభావాన్ని తన ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించారు.
ఈ గ్రంధంలో. పరమరుల రాజ్యంలో శివుని ఆదేశంతో అనుగ్రహంతో మహానుభావుడైన కేశవశర్మకు నలుగురు ఉత్తములైన పుత్రులు కలిగినారు. సంస్కృత మహాకవి. సంస్కృత వ్యాకరణకర్త వాక్యపదీయం. వాక్యప్రదీప, రాహత, కారిక మరియు సుభాషిత రత్నావళి గ్రంథకర్త అయిన భర్తృహరి, అతిలోక సాహవంతుడు ధర్మాత్ముడు మహాకాళీభక్తుడు అయోధ్యాలయ పునరుద్ధారకుడు శకకర్త అయిన విక్రమార్కుడు, పండితుడు మహావివేకవంతుడు కాళీ అనుగ్రహపాత్రుడు అయిన భట్టి మరియు పాణిని వ్యాకరణకర్త దివ్య శివమహిన్మా: స్తుతికర్త అయిన వరరుచి కాత్యాయనుడు. మహారాజూ కేశవశర్మ యోగ్యుడైన భర్తృహరికి రాజ్యభారమప్పగించి వానప్రస్థమును స్వీకరించాడు.
విక్రమాదిత్యుడు, అతడికి వంటి పై 32 చక్రవర్తి లక్షణాలతో పుట్టాడు. అతడు మ్లేచ్చులను తరిమి అమ్మవారిని ఉపాసించి ఉజ్జయిని రాజధానిగా చేసుకుని రాజ్యం చేసాడు. పార్వతిదేవి ఆదేశం మేరకు శివభూతగణాలలో ఒకడు భేతాళునిగా వచ్చి విక్రమాదిత్యునికి రక్షగా ఉంటూ అతని సలహా మేరకు అశ్వమేధయాగం చేసి ధర్మాన్ని సుస్థిరం చేసి సింధూనది, బదరి, కపిల రాజ్యం, సేతుబంధన(రామేశ్వరం) హద్దులుగా రాజ్యం చేసాడు.. ఈశ్వర ప్రసాదిత 32 కళలున్న (ద్వాత్రిమ్సిక) సింహాసనం మీద ఆసీనుడై జనరంజకంగా రాజ్యం చేసాడని ఐతీహ్యం.
సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి పాణిని. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘’అష్టాధ్యాయి’’. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణంగా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన, దాక్షీ పుత్రా, శానంకి, శాలా తురీయ, ఆహిక, పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి. అష్టాధ్యాయి రాసిన వాడు అష్టనామాలతో విలసిల్లాడు. ఈయన ముఖ్య శిష్యుడే వరరుచి కాత్యాయనుడు.
చిన్నప్పటినుంచి భర్తృహరి సాధుసజ్జనుల సేవలుచేస్తూ ఉండేవాడు. తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శీలముచే సంసారమునకు రోసి, భర్తృహరి రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెను.
భర్తృహరి ప్రసిధ్ధ వయాకరుణుడు, వ్యాకరణశాస్త్రంలో "వాక్యప్రదీయం" అనే ప్రసిద్ధ గ్రంధాన్ని రచించారు. ఇందలి మొదటి శ్లోకము … అనాది నిధనం బ్రహ్మ శబ్ద తత్త్వం యదక్షరం! వివర్తతే అర్థభావేన ప్రక్రియా జగతో యథా!!
అర్థము: శబ్ద బ్రహ్మము అనాది, అక్షరము (శాశ్వతము)). జగత్తు వలె ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతుంది. భర్తృహరి శబ్దార్థాలను బ్రహ్మము జగత్తులతో పోలుస్తాడు. ఇది వేదాంతమునూ వ్యాకరణమునూ సమన్వయము చేస్తుంది. సంస్కృతములో ప్రతి వర్ణము అర్థవంతమైనది. ప్రతి అక్షరము మంత్రములలో బీజాక్షరము. మంత్రము, తంత్రము, యంత్రములలో వర్ణములు ఉపయోగింప బడతాయి.
నీతిబోధకమైన గ్రంథాలలోభర్తృహరి సుభాషిత త్రిశతి సంస్కృత లఘుకావ్యం. ఇందు మూడు వందల మంచి సూక్తులతో శతక సాహిత్యంలో సాటిలేని మేటి గ్రంథ రచనగా ప్రసిద్ధి కెక్కింది. ఈ భర్తృహరి సుభాషితాల్లో నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాల్లో మంచి…చెడుల మధ్య తేడా ఏంటో తెలుసుకోగలిగే శక్తి వస్తుంది. అనేకభాషలలో ఇది అనువదించబడింది.
భర్తృహరి రచించిన సుభాషిత రత్నవలిలో విశేషాలు ఎన్నో.... ఎన్నెన్నో....నీతి అంటే చాలా మందికి తెలుసు కాని అసలు నీతిలో ఎన్ని పద్ధతులున్నాయో... మూర్ఖ పధతి .... అర్ధ పదాతి..... దుర్జన పధ్ధతి...... దైవ పధ్ధతి ఏమిటో విశదీకరించబడ్డాయి ఈ మహా గ్రంథం లో….ఈ గ్రంధం మీ ఇంట ఉంటె.. మీకు మీ పిల్లలకే కాదు... వారి పిల్లలకు... వారి వారి పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.
గ్రంథకర్త శివకిషెన్ జీ సమర్పించిన భర్తృహరి చరిత్ర -శతక త్రిశతి చాలా సులువుగా ..దివ్యంగా… చాలా బాగుంది. వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.
భర్తృహరి చరిత్ర -శతక త్రిశతి చదవండి.…చదివించండి .

ebook

Published April 12, 2019

About the author

Sivkishen

23 books18 followers
Sivkishen Ji is the pen name of Kishen SSR. His ancestors were Suryavanshi Rajputs.His great ancestor Maharana Pratap Singh ruled for about 57 years. He is science graduate of Andhra University. He specialized in Business Administration, Behavioral Psychotherapy, and Textiles. A gifted speaker and extensively travailed all over the world. He is a Paul Harris Fellow of Rotary International and recipient of several Honours and prestigious awards including Bharatiya Udyog Ratna Human Excellence Healthcare. He is a Vedic Researcher, well trained, exploring the Vedic wisdom and penning since 1964. He loves reading a lot of books with personal taste. His specialty is to review any kind of book, from kids’ stuff to romance novels to biographies, mythology, and history. He has a knack for writing, and enjoys expressing his opinion, with a focus on the language, style, and content and assesses realistically giving reviews for inspiration and guidance.
He brought out work titled Wisdom Beyond Boundaries with copyright No 54426 of 25.09.2013 and published the Kingdom of Shiva, Shiva Samrajyam, Mysterious Kailash, Vedic Spaceships, The King Yayati, Rigvedic Legendary Battles, Quest of Olympias and Vedic Vaimānika. These are available both in Kindle and Paperback edition on Amazon and Lambert Academic Publications. Suffocation Ji had contributed1440 Image stories with copyrighted Images licensed under the Creative Commons Attribution-ShareAlike 3.0 License. He is a Professional Reader and received an evaluation from the world-renowned Spiritual Leaders Saints Philosophers Scholars and Scientists, who have recognized his focus on the book's purpose, contents, and authority. They appreciated his unique art of writing on science in a Mythological story form. They liked his writing style and the art of presentation is simple, lucid, and evocative. They have tiled him as Rishi Vishwamitra Abhinava Vyasa etc as they felt thrilled on imparting wisdom that makes everyone feels so good and this is what modern readers loved to read chew digest and remember for ages with speechless wonder!

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for Sivkishen Sivkishen.
Author 23 books18 followers
June 11, 2019
సుభాషిత త్రిశతి ముద్రణములు ఆంగ్ల వ్యాఖ్యాభాషాంతరీకరణములతో నెన్నో వెలువడినవి. వానిలో ముఖ్యమైన ఆంధ్రానువాదకులలో ఏలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి యనువారు ముఖ్యులు. వీనియన్నింటికన్నా మిన్నయై రచించినట్టిది భర్తృహరి శతక సాహిత్య సాహిత్యం. దానిని విశ్వవిఖ్యాత గ్రంథకర్త శివకిషెన్ జీ,రచించిన ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి.
భర్తృహరి శ్లోకాలు రాని వారెవరూ ఉండేవారు కారు. ముఖ్యంగా నీతిశతక పద్యాలు బోధనా అంశాలు గా ఉండేవి .సరళంగా, గంభీరంగా భావసంపదతో రాణిస్తాయి. ఇలాంటివి అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుకోవటం అవశ్య కర్తవ్యం.
భారతీయ జీవన విధానం, నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రజలకు మంచి నడవడిక నేర్పేందుకు దోహదపడేది భర్తృహరి చరిత్ర -శతక త్రిశతి. యందలి శ్లోకములన్నియు అనుభవజ్ఞానముతో చెప్పినట్లు పాఠకుల హృదయాలలోనికి సూటిగా పోయి వారిని సంస్కరించుటకు అనుకూలములై యున్నవి. ఎందుకంటే వారు మానవుల స్వభావాన్ని తన ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించారు.
భర్తృహరి రచించిన సుభాషిత రత్నవలిలో విశేషాలు ఎన్నో.... ఎన్నెన్నో....నీతి అంటే చాలా మందికి తెలుసు కాని అసలు నీతిలో ఎన్ని పద్ధతులున్నాయో... మూర్ఖ పధతి .... అర్ధ పదాతి..... దుర్జన పధ్ధతి...... దైవ పధ్ధతి ఏమిటో విశదీకరించబడ్డాయి ఈ మహా గ్రంథం లో….ఈ గ్రంధం మీ ఇంట ఉంటె.. మీకు మీ పిల్లలకే కాదు... వారి పిల్లలకు... వారి వారి పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.
గ్రంథకర్త శివకిషెన్ జీ సమర్పించిన భర్తృహరి చరిత్ర -శతక త్రిశతి చాలా సులువుగా ..దివ్యంగా… చాలా బాగుంది... చదవండి.…చదివించండి
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.