Jump to ratings and reviews
Rate this book

Sira [Soon to be a Motion Picture - Novel]

Rate this book
ఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది అని నా నమ్మకం . స్టాన్లీ గార్డెనర్ నుంచి జాన్ గ్రీషామ్ వరకూ కోర్ట్ డ్రామా బుక్స్, మూవీస్ అన్నీ నాకు ఇష్టం. వాటిలాగే నా నమ్మకం 'కరెక్ట్' అని ప్రూవ్ చేసింది ఈ రాజ్ మాదిరాజు గారి పుస్తకం. ఇంట్రస్టింగ్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో .. ఆ ఫేమస్ ఇన్స్టిట్యూట్‌లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు, వాటి వెనక వున్న రహస్యం ఛేదించాలని సిద్ధపడ్డ యంగ్ లాయర్ రామ్.. తనకెదురుగా కేసు వాదిస్తోంది. ఇండియాలో నెంబర్ వన్ లాయర్, తన గురువు 'మూర్తి సర్......! ఇద్దరు ఇంటిలిజెంట్, స్మార్ట్ లాయర్స్... ఒకరిది టెక్నికల్లో బ్రిలియెన్సు.. ఒకరిది ఎమోషనల్ ఫోర్సు.. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ అనే ఎరీనాలో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు .... ఈ మేటర్ చాలదూ పుస్తకం చివరివరకు ఆపకుండా చదివించటానికి... హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ రీడింగ్.. పి. సత్యానంద్.

268 pages, Paperback

Loading...
Loading...

About the author

Raj Madiraju

2 books

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (25%)
4 stars
3 (25%)
3 stars
5 (41%)
2 stars
1 (8%)
1 star
0 (0%)
Displaying 1 - 2 of 2 reviews
Profile Image for Aruna Kumar Gadepalli.
2,983 reviews120 followers
November 26, 2019
నేను చదివిన ఓ మంచి పుస్తకం. చదువుల పేరిట జరుగుతున్న ఈ కాలపు ఆర్భాటం, తరుగున్న విలువలు, పెరుగుతున్న ఆత్మహత్యల పై రాసిన పుస్తకం.
119 reviews4 followers
December 29, 2025
అన్వీక్షికీ పబ్లిషర్స్ మంచి తెలుగు పుస్తకాలు ప్రచురించే అభిరుచి కలిగిన సంస్థ, Open your Eyes, Open your Mind, Open your Soul ఏదో ఒకటి ఆ ' మంచి' కి నిర్వచనం.
రాజ్ మాదిరాజు గారి పుస్తకం "సిరా" కార్పొరేట్ కాలేజీల పని తీరు గురించి కళ్ళూ తెరిపిస్తుంది, ఆలోచనా రేకిత్తిస్తుంది. మంచి పుస్తకం అని చెప్పుకునే చెబుతుంది.ఇది 2019 లో రిలీజ్ అయిన పుస్తకం కనుక మీలో చాలామంది చదివే ఉంటారు.నాలాగ కొత్తగా చదివే, చదవబోయే వారికే ఈ రివ్యూ.
కథ రెండు వేర్వేరు కాలేజీల్లో మొదలు అవుతుంది.ఒకటి రాజకీయనాయకుడు సిద్ధరామయ్య ( సిరా) ఆధ్వర్యంలో నడిచే సిరా సంస్థ వారి అనేక కాలేజీల్లో హైదరాబాద్ లోని ఒకానొక బ్రాంచి.దీనికి ప్రిన్సిపాల్ శ్రీధర్. చేతికి రంగు అంటకుండా 'మేనేజ్' చేసే మేనేజర్ గణేష్. తెర వెనుక కథ నడిపే గణేష్ మేనమామ సిరా.
ఇందులోని మున్నా అనే టాపర్ తన మిత్రుడు ఆదర్శ్ కు తాను సిరా ఒత్తిడికి బతుకు భయంతో ఆత్మహత్యలు చేసుకునే తీరుకు అడ్డుకట్ట వేయడానికి ఆత్మహత్య చేసుకుంటున్నానని సందేశం రాసి, ఉరి పోసుకోవడం తో ' కథ' మొదలవుతుంది.
మరొక కాలేజీ అదే హైదరాబాద్లో ఉన్న పడాల సుబ్బారావు కాలేజీ. డీన్ జనక్ రెడ్డి. విద్యార్ధులు రామ్ ( హీరో), రమ్య( డీన్ కూతురు), ఇంకా బోలెడు మంది సహవిద్యార్ధులు.
ఆదర్శ్ కు రామ్ పరిచయం కావడం ఒక మలుపు.జీనియస్
లాయర్ మనోహర్ మూర్తి లా కాలేజీకి గెస్ట్ ఫ్యాకల్టీగా క్లాసులు తీసుకోవడంతో మరో మలుపు.
ఆశ ఈ కథలో మరో హీరోయిన్.ఆదర్శ్ ను అమ్మలా పెంచుతూ సిరాలో కౌన్సిలర్ గా పనిచేసే అమ్మాయి.
సిరాలో ఆత్మహత్యల మీద కోర్టులో పిల్ వేసి, మెంటార్ మనోహర్ మీద రామ్ విజయం సాధించి సిరా కాలేజీలను మూయించే దిశగా జడ్జిమెంట్ తెప్పించడం ప్రధానాంశం.
నవల ఆద్యంతం చదివిస్తుంది. దానికి కారణం అద్భుతమైన కథనం. మూడవ చాప్టర్ "కృష్ణస్వామి తీర్థులు." అనే వాక్యంతో మొదలవగానే యండమూరి నవలా అనిపించి ఒకసారి అట్ట మీద రచయిత పేరు చూసుకుంటాము. నవల మొత్తం యండమూరి మార్కు పాత్ర చిత్రణ, శైలి మనకు స్ఫురించి మనలను చదివేటట్టు చేస్తాయి.

కథలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నపుడు, ఏ ఒక్కరినీ చంపకుండా, ఇద్దరికీ న్యాయం చేయడం చాలా కష్టమైన విషయం. ఈ నవల రాయడంలో ఇదొక్కటే రచయితకు క్రిటికల్ గా అనిపించి ఉండవచ్చు.
కథలో లా కు సంబంధించి మంచి పరిజ్ఞానం దొరుకుతుంది.లా కాలేజీ పిల్లలు తప్పక చదివి చర్చించుకోవచ్చు. ఒబిటర్ డిక్టా వంటి లీగల్ జార్గన్ పరిచయం చేసుకోవచ్చు.
ఈ కథకు సమీక్ష రచయితే, రామ్ మాటల్లో ఒక దగ్గర రాయడం విశేషం.
" ఇది నాలుగు లవ్ స్టొరీస్ కథ. నాది, ఇంకా రమ్య, ఆదర్శ్,ఆశ, మూర్తి.
ఒకటి రొమాంటిక్
ఒకటి బ్రోమాంటిక్
ఒకటి ప్లాటోనిక్
ఒకటి అకడమిక్
సింపుల్గా చెప్పాలంటే నేను కలాన్ని. వీళ్ళు నాలో నిండిన సిరా."
నవలకు పెట్టిన 'సిరా' పేరును ఎలా అన్వయించుకోవాలో , ముఖచిత్రం ఔచిత్యం ఏమిటో ఇక్కడ పాఠకులకు అర్థమవుతుంది.
నాకు నచ్చిన రెండు రాజ్ మార్కు సంభాషణలతో ముగిస్తాను.
"నేను తప్పు చేస్తున్నానా డాడీ?"....రమ్య
" లేదు కుట్టీ. కానీ వాడు కూడా తప్పు చేయట్లేదు.'....జనక్ రెడ్డి.
" నువ్వు కన్ఫ్యూజవుతున్నావు నాన్నా! ఎవరు తప్పు చేయకుండా ఇద్దరం ఎలా బాధపడతాం?" ...రమ్య
ఆలోచించే వాళ్ళకు ఆలోచించేంత!

ఒక పక్క ఆశ్చర్యంగాను,మరో పక్క ఆనందం గాను, మూడో పక్క భయంగానూ ఉంది.( అసమర్థ బుర్రలకు అయిదారు పక్కలుంటాయి.అయోమయంగా)
ఇలాటి స్టేట్మెంట్స్ వింటే ఒక పక్క నవ్వూ,ఒక పక్క రచయిత మీద అభిమానం, మూడో పక్క ఈ ఆలోచన ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం కలుగుతాయి. ( మనది అసమర్థ బుర్రా అని మరో పక్క తొలుస్తోంది) కదా!

సత్యానంద్ గారి బుక్ బ్లర్బ్ చదివితే పుస్తకం కొనకుండా ఉండలేరు. కొన్నాక చదవకుండా ఉండలేరు.చదివాక ఆయన గారంటీ ఇచ్చినట్టుహాపీ అండ్ థ్రిల్లింగ్ రీడింగ్ అనుకోక మానరు. ఇది సినిమాగా వచ్చాక చూడక మానరు. ఈ లోగానే చదివేయండి, కథ మీకు తెలిసినా ఈ పుస్తకం అసలు ఆనందం కథనంలోనే!!

చక్కటి థీమ్ తో ఆద్యంతం చదివించేలా రాసిన రాజ్ గారి కలంలోని "సిరా" కు ధన్యవాదాలు!!
Displaying 1 - 2 of 2 reviews