"ప్రకటన గ్రంథం" పరిశుద్ద బైబిలు గ్రంథంతో కనీస పరిచయం ఉన్నవారికెవరికయినా, ఆ పేరు వింటేనే ఒడలు జలదరింపజేసే విచిత్ర గ్రంథం! పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాలలోకెల్లా అర్థం చేసుకోవడానికి అత్యంత క్లిష్టమైన గ్రంథం. ఈ అద్భుతగ్రంథం సగటు క్రైస్తవుడికి అర్థంకాదు, కానీ అతడిలో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. ఆ గ్రంథపు సందేశాన్ని అర్థం చేసుకోవాలన్న తహతహ, సందేశాన్ని అర్థం చేసుకోలేని అశక్తత, దీనికి తోడు రకరకాల బోధకుల భిన్న వ్యాఖ్యానాలు సామాన్య క్రైస్తవుడి మతి పోగొట్టేస్తున్నాయి . ఈ గందరగోళ పరిస్థితులలో, తరతరాల మానవజాతి అన్వేషణకు ఎట్టకేలకు సర్వసృష్టికర్త పంపిన చిట్టచివరి, అధికారిక సమాధానం... క్రీస్తు రెండవ రాకడ సమయాన్ని గూర్చిన సర్వసత్యం....