విరాట్ ఒక చిన్న పుస్తకం గానే మొదలయింది కానీ కథలోకి వెళ్ళక అర్దం అయింది చిన్న పుస్తకమే కానీ ఈ పుస్తకం తాలూకా లోతును చూసాక బయటకి రావటం వచ్చి సాధరణంగా వుండటం కష్టమే . ఎక్కడో ఒక చోటా హెర్మన్ హెస్సీ రాసిన సిద్దార్థ మరియు త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన అసమర్థుని జీవయాత్ర తాలూకా పొరలు బహుసా నాకు తారసపడ్డాయి ఏమో కాని చాలా లోతైనా ఒకరకమైన సత్య పరిశోధకుడిని పరిచయం చేసింది. ఒక అత్యంత గౌరవ స్థానంలో వున్న యోధుడు పరాక్రముడి జీవిత కథ ఈ విరాట్. విరాట్ పుస్తకం చదవడం వేరు, అర్దం చేసుకోవడం వేరు ఎంత లోతు అయిన మనసిక స్థితిని అనుభవించే క్షణాలను బహుశా మన రోజు వారి జీవితంలో ఎక్కడో ఒక చోట మనకు మనమే ఎదో ఒక సందర్భంలో మనం ఊహించని విధంగా ఎదురుపడి ఉంటుంది దాని తాలూకా ప్రభావితం వల్లనో మన ఆలోచనలను విరాట్ లాగా కథారూపం దాల్చలేకపోవచ్చు.. ఈ పుస్తకం చదివే ముందుగాని విక్రయించే ముందు కాని ఈ పుస్తకం తాలూకా పరిచయం కూడా నాకు తెలియకపోవం కాస్తా నా అజ్ఞానాన్ని తేటతెల్లంచేశాయి. ఎందుకు నా చేతిలోకి వచ్చిందో ఈ పుస్తకం వచ్చిన క్షణమే చదవాలి అనే ఒకరకమైన తెలియని ఆకర్షణ ఏర్పడింది..
సత్యపరిశోధన మనిషికి ఏ సందర్భంలో ఎదురు అవుతుంది. ప్రతి సందర్భం ప్రతి నిర్ణయం ప్రతి ఒక్కరికి ఎన్నో మార్గాలను చూపిస్తాయి. ఇక్కడ మార్గాలు మాత్రమే వేరు కానీ గమ్య స్థానం ఒకటే.
సంఘర్షణ మనిషికి ఎంతవరకు అవసరం ఒక వేళా సంఘర్షణే సూత్రమైతే ఎంత పరిధి వరకు అవలంబించవచ్చు. ఈ పుస్తకం నిజానికి ఒకరకమైన అద్దంలాంటిది. నిన్ను నీకు నగ్నంగా పరిచయం చేస్తుంది. బహుశా ఈ పుస్తకం చదివిన అందరికి ఈ రకమైన అనుభూతి పొందలేకపోవచ్చు లేదా పొందిన దానిని పాటించడంలో ఎంతోమంది విఫలమైపోవచ్చు. అందరికి అర్ధమేకాకపోయిన, అర్ధం చేసుకుని ఆచరించలేకపోయిన తిరిగి తిరిగి మనం ఇతరుల పట్ల చేసే న్యాయకోశాధికారి పాత్రను మనం విరమించుకోవడం మంచిది అనేది రచయత యొక్క ముఖ్య ఉద్దేశం. సత్యాన్వేషణ ఒక ఒంటరి ప్రయాణం ఎన్నో అవమానాలను నిందనలను హేళనలను పరిచయం చేస్తుంది అయినా సరే వాటి కర్మ ఫలితాన్ని లెక్క చేయకుండా సత్యాన్ని వెతకడంలో అనుక్షణం రాగద్వేషాలకు అతీతంగా జీవించడం ఒక గొప్ప తాత్వికత అలాంటి నిస్వార్థమైన జీవితం ఒకోసారి ఎవరికీ అర్థంకాని ఎవరికీ ఏమి కానీ ఒక అనాధగా మిగిలిపోవచ్చు లేక ఎదుటమనిషి జీవితంలో కరుణాని ప్రేమని చిగురించి ఒక గొప్ప నిశబ్ద సాహసిగాను మిగిలిపోవచ్చు