Jump to ratings and reviews
Rate this book

విశ్వదర్శనం - పాశ్చాత్యచింతన

Rate this book
తత్వ శాస్త్రాధ్యయనంవల్ల ప్రయోజనం ఏమిటి? భౌతికశాస్త్రాలు అతి వేగంగా పురోగమిస్తూ, మానవ జీవిత విధానాన్ని మార్చివేస్తున్న ఈ కాలంలో ఎవరికి కావాలి తత్వమీమాంస, అని కొందరు ప్రశ్నించవచ్చు.

ఇది అనాలోచిత వైఖరి తత్వజిజ్ఞాస మానవ నాగరికతకే పునాదివంటిది. వివిధ కాలాలలో ప్రజల మత, సాంఘిక, నైతిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల మీద, విశ్వాసాల మీద ఆయా కాలాల నాటి తత్వవేత్తల ప్రభావం ఎంతో ఉన్నది.

ఈ రచన ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలో ఉన్నవారికే కాక, యువతరం దృష్టిని కూడా ఆకర్షించగలదని ఆశపడుతున్నాను. తత్వశాస్త్రాధ్యయనం చేసిన వ్యక్తి మనస్సు మరింత పరిణతం, మేధ మరింత నిశితం, హృదయం మరింత విశాలం అవుతాయని నాకు అనిపిస్తున్నది.

విల్ డ్యూరాంట్ తన “ప్లెజర్స్ ఆఫ్ ఫిలాసఫీ”లో పేర్కొన్నట్టు తత్వశాస్త్రాధ్యయనంలో ఒక అనిర్వచనీయానందం కూడా ఉన్నది. అధ్యయనానంతరం పఠిత తనకు తానుగా, పూర్తిగా తనదే అయిన ఒక నూతన జీవిత దృక్పథాన్ని ఏర్పరచుకొనగల శక్తిని సముపార్జించు కోగలడని నాకొక నమ్మకం.

ప్రపంచ మేధావుల మనఃకుహరాంతరాలలోనికి, వారి మనోవాల్మీకాలలోనికి, వారు సృష్టించిన మంత్రనగరి సరిహద్దులలోనికి ఈ సాహసయాత్ర కొలంబస్ అమెరికాఖండ యాత్రకు, ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రలోక యాత్రకు తీసిపోదు. ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా పాఠకులను ఆహ్వానిస్తున్నాను.

- రచయిత

517 pages, Paperback

2 people are currently reading
9 people want to read

About the author

Nanduri Ramamohana Rao

6 books3 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for Aditya Annavajjhala.
56 reviews7 followers
March 24, 2021
జీవితంలో ప్రతి మనిషికి కొన్ని ప్రశ్నలు తప్పకుండా వస్తాయి...

సంతోషం అంటే ఏంటి?? దానిని సాధించడం ఎలా??

దేవుడు అనే వాడు అసలు ఉన్నాడా?? లేదా అది కేవలం మన భ్రమ మాత్రమేనా??

మనిషి గొప్పవాడా?? లేదా ఈ ప్రకృతి గొప్పదా?? మనిషి కేవలం ఈ విశాల విశ్వంలో ఒక ఇసుక రేణువు మాత్రమేనా?? లేదా ఈ విశ్వామంతా మనిషి కోసమే ఉందా??

పాశ్చాత్య తత్త్వశాస్త్రం (Western Philosophy) కి భారతీయ తత్త్వశాస్త్రం(Indian Philosophy) కి పోలిక ఉందా?? లేదా రెండు వేరు-వేరు ఆలోచనలేనా??

Socrates,plato, aristotle లాగ మన శంకరచార్యులు, రామానుజచార్యులు, మద్వాచార్యులు తత్త్వ ఆలోచనలు ఒకటేనా??

ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనకి ఎప్పుడొక్కపుడు వస్తూనే ఉంటాయి.. కానీ ఆలోచించే అంత సమయం, ఆలోచన శక్తి మనలో లేకపోవచ్చు...

ఈ ప్రశ్నలకి సమాధానం తో పాటు మనలో కొంచెమైనా తత్వచింతన కోసం నండూరి రామ్మోహన్ రావు గారు రాసిన పుస్తకాలు తప్పకుండా చదవాల్సినవి..

పాశ్చాత్య దర్శనంలో అప్పటి గ్రీక్ తత్త్వవేతలు థేలిస్, అరిస్టటిల్ నుంచి నిన్నటి నిషే, karl marx వరకు ఉంది...

మన మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన ఎన్నో తత్త్వ, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు ఇవి..
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.