ఈ పుస్తకం మనకు తెలీని ఒక కొత్త ప్రక్రియ వైపుకు తీసుకుపోతుంది. గతమెంతో ఘనకీర్తిగా ఉన్న మన చరిత్రలో ఎందరో మహానుభావులున్నారు. వారిలో కొందరు నామమాత్రంగా మనకు తెలుసు, అంతే గానీ, వారి జీవితాలలో జరిగిన అనేకానేక ముఖ్య సంఘటనలు తెలియవు. ముఖ్యంగా ఆరోబిందో, రబీంద్రనాథ్ టాగోర్ లాంటి పెద్దలకు తెలుగునేలకూ ఉన్న సంబంధాలు. ఈ చిన్ని పుస్తకంలో వారి అనుభవాలనే తన అనుభవాలుగా నమ్మిన వ్యక్తి మాత్రమే రాయగలిగిన స్థాయిలో శ్రీరమణ మనకు ఆయా సంఘటనలను ఆవిష్కరింపచేస్తారు. మనకు వెంటనే వెనుక ఉన్న కాలానికి సంబంధించిన గొప్ప వ్యక్తుల గురించి మరికొంత తెలుసుకునే అవకాశం ఇస్తుంది ఈ పుస్తకం. ఇలాంటి గొప్ప రచనను అందించిన పెద్దలందరికీ నమస్కారం. కుదిరితే అందరూ చదవాలి.
మంచి పుస్తకం. ఇది ఒక అద్భుత (అబద్ధపు) స్వగతం అని తెలిసినప్పటికీ, ఇందులోని సందర్భాలు, వ్యక్తులు వారి వ్వక్తిత్వ వర్ణన చదివాక వారి గురించి మరింత తెలుసుకోవాలి అన్న ఉత్సుకత నీ కలుగజేస్తుంది. ఒక కళారూపం స్ఫూర్తి తో కొత్త పుస్తక ప్రక్రియగా మారడం కేవలం "వి ఎస్ ఎస్" గారి ప్రేరణ వల్లే అయ్యి వుంటుంది అని నా గట్టి నమ్మకం.