అన్నమయ్య పదామృతం దాచుకో నీ పాదాలకు… ‘నా నాలికపై నుండి, పూని నాచే నిన్ను పొగిడించితివి! కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివి’ అంటూ ఆ శ్రీనివాసుడికి సవినయంగా తన సంకీర్తనలు సమర్పించుకున్నారు అన్నమాచార్యులు. అంతటి వాగ్గేయకారుని పదాలకు సరళ వ్యాఖ్యానంతో కూడిన ఈ ‘అన్నమయ్య పదామృతం’ పుస్తకాన్ని కూడా అదే భావనతో ‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలు’ అంటూ శ్రీవేంకటేశ్వరునికి వినమ్రంగా సమర్పించుకుంటున్నాం.