మీకో కథ చెప్తా..
దానికంటే ముందు, ఈ పుస్తకం గురించి కొంచం సేపు మాట్లాడుకుందాం.
నల్లగొండ అనే ఒక చిన్న ఊరులో, ఆ ఊరి మనుషుల గురించి, తాను పెరిగిన పరిసరాల గురించి, అమ్మ నాన్న ల గురించి, చిన్నప్పటి స్నేహితుల గురించి.. ఇలా రచయిత తన బాల్యం లో జరిగిన సంఘటనలు నెమరు వేసుకుంటూ రాసినదే ఈ పుస్తకం.. నల్లగొండ కథలు.
నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, రచయిత తెలంగాణ యాస లో ఈ పుస్తకం రాయడం. ఆ యాస లో కథలు చదువుతుంటే, నా చిన్నప్పటి స్నేహితుడు నా పక్కన కూర్చొని మా ఇద్దరి బాల్యం గురించి కబుర్లు చెప్తునట్టుంది.
ఈ పుస్తకం చదివినంత సేపు ఏమనిపించిందంటే... చిన్నప్పుడు summer holidays కి ఊరు వెళ్తే, మా తాత తో ఊరి గురించి మాట్లాడుతున్నట్టు, అమ్మమ్మ చేత్తో తిట్లు తింటునట్టు, కజిన్స్ తో కొట్లాడతునట్టు, స్నేహితులతో "ఊరు ఎంత మారిపోయింది కదా" అని ముచ్చట్లు పెట్టుకున్నట్టు ఉంది. 🥰
ఇంకొక విషయం ఏమిటంటే... రచయిత పుట్టింది, పెరిగింది నల్లగొండ లో, నేను పుట్టింది నాగార్జున సాగర్ లో. ఈ పుస్తకం లో "సాగర్ టూర్" అని ఒక చిన్న కథ రాశారు మా ఊరి గురించి మాట్లాడుతూ. అది చదువుతున్నంత సేపు, చిన్నప్పటి సంగతులు అన్ని గుర్తొచ్చి.. "అరే మేము కూడా సాగర్ డ్యాం కి వెళ్ళడానికి ఇలాగే ఉత్సాహంగా వెళ్ళే వాళ్ళం కదా" అని అనుకున్న.
కొన్ని కథలు చదువుతునప్పుడు చాలా నవ్వు వచ్చింది, కొన్ని చదువుతునప్పుడు ఇప్పుడు ఆ బాల్యం లో ఉన్నంత innocence ఏటు పోయిందో అని కొంత బాధ కలిగింది. కానీ చదువుతున్నంత సేపు చాలా nostalgic గా హాయిగా అనిపించింది. 🤗
మీరు కూడా అలా బాల్యానికి.. మీ ఊరు కి.. ఒక సారి వెళ్లి రావలనుకుంటే, ఈ పుస్తకం చదవాల్సిందే. 😇
--
సరే, కథ చెప్తాను అన్నాను గా..
నేను నాలుగో తరగతి లో చదువుతునప్పుడు అనుకుంటా, మా తాత కి transfer అయ్యీ నల్లగొండ లో కొన్ని యేండ్లు క్లర్క్ గా పని చేశారు. అప్పట్లో ఎండ కాలం సెలవుల కి, సాగర్ కాకుండా నల్లగొండ కే పోయేటోల్లం. ఎండ కాలం అయిన కూడా, అప్పుడప్పుడు వర్షాలు పడెటివి. అలా ఎండలు ఉన్నప్పుడు వర్షాలు పడితే, భూమి లో ఉన్న ఎర్ర పురుగులు కొన్ని బయటికి వచ్చేవి. చూడ్డానికి చాలా అందంగా ఉండేవి ఆ పురుగులు. అయితే, అవి అలా బయిటికి వచ్చినప్పుడు, నేను.. మా తాత వాళ్ల పక్కింట్లో ఉండే అక్క లు కలిసి.. ఆ పురుగులు ఏరుకుంటూ.. అవి ఒక అగ్గిపుల్ల డబ్బా లో వేసుకొని ఇంటికి వచేవల్లం. అదే మా కాలక్షేపం ఆ సెలవుల్లో. అవి అలా జమ చేస్తే ఏమొస్తదని ఒక అక్క ని అడిగితే "ఇవి మన దగ్గర పెట్టుకుంటే అదృష్టం వస్తది" అని చెప్పేది.
నిజంగా అదృష్టం దాని వల్ల వచ్చిందో లేదో తెలీదు గానీ, ఆ జ్ఞాపకం మాత్రం నాతో అలా మిగిలిపోయింది. ❤️
--
ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఈ పుస్తకం నాకు ఎన్నో గుర్తు చేశాయి.. అలా గుర్తు చేసే విధంగా రాసిన రచయిత కి నా ధన్యవాదాలు. 🙏