Jump to ratings and reviews
Rate this book

Manodharmaparagam

Rate this book

Unknown Binding

First published January 1, 2020

2 people are currently reading
23 people want to read

About the author

madhurantakam narendra

4 books1 follower

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
3 (25%)
4 stars
5 (41%)
3 stars
3 (25%)
2 stars
1 (8%)
1 star
0 (0%)
Displaying 1 - 4 of 4 reviews
Profile Image for Aditya Annavajjhala.
56 reviews7 followers
Read
November 8, 2021
భారత ఖండం ఎన్నో సమూహాల కలయిక. సమాజంలో ప్రతి వ్యక్తి లేదా సమూహంకి నిర్దిష్ట పనిని ఒప్పజప్తు కులాలు అనేవి ఏర్పడయి. కానీ కాలక్రమేణా కులాలు సామాజిక అస్పృశ్యత ని పెంచుతూ, బ్రిటిష్ వాళ్లు వచ్చే నాటికి చాలా నీచమైన స్థితిలో ఉన్నాయి.. దానితో వాళ్ళు చాలా కుల ఆచారాలను నిర్ములించడానికి ప్రయత్నం చేశారు. అలా కనుమరుగై పోయిన కులాల్లో "దేవదాసీ" కులం ఒకటి. దేవదాసీలు దేవాలయంలో సంగీతం, నాట్యం చేస్తూ దేవుడికే తమ జీవితం అంకితం అంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ దేవాలయంకి సంబంధించిన ధర్మకర్తల ఈ దేవదాసీల పోషణ, శిక్షణ చూస్తూ ఉండేవాళ్ళు. (పుస్తకం లో ఇంకా విపులంగా చెప్పారు.. నేను కేవలం పరిచయం కోసం చిన్నగా చెప్పాను).

అలాంటి దేవదాసి కుటుంబంలో నుంచి వచ్చిన మన కథ నాయక "చిత్తూరు కుమదవల్లి నాగలక్ష్మి" . తన చుట్టూ ఉన్న పరిస్తితుల వల్ల తను దేవదాసి లా కాకుండా కేవలం సంగీతం కోసమే తన జీవితాన్ని అంకితం ఇవ్వాలి అనుకుంటుంది. చివరికి తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగాయి, అసలు ఎందుకు దేవదాసి అవ్వకూడదు అని అనుకుంది. ఇప్పుడు అసలు ఆ కులం ఎందుకు లేదు. అలా దేవాలయంలో నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు ఏమయ్యారు అనేది నవల ముఖ్య కథ..

ఇక్కడ మనం రెండు విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒకటి రచయిత కథనం రాసిన శైలి. ఇది కేవలం ఒక్క నాగలక్ష్మి కథ మాత్రమే కాదు అన్నట్టు, ఎందరో దేవదాసీల కథ ఇదే అనే విధంగా రాసారు. దాదాపు 30 మంది ఆడవాళ్లు నాగలక్ష్మి జీవితాన్ని తమ అనుభవాలతో చెప్తూ.. అప్పట్లో గోపిచంద్ గారు రాసిన "పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా"లో లాగా పాత్రలు మనతోనే మాట్లాడుతాయి.

ఇంకా రెండవది ప్రతి స్త్రీ పరిచయం ముందు చేసే ఉపోద్ఘాతం. ఈ నవల చరిత్రాత్మక నవల కాబట్టి, చరిత్రలో జరిగిన కొన్ని సన్నివేశాలను, అప్పటి సామాజిక మార్పులను మనకి చెప్తూనే నాగలక్ష్మి ని కలవబోయే కొత్త పాత్ర ని మనకి చెప్తూ ఉంటారు..

దేవదాసీలు తమకి మాత్రమే వచ్చిన విద్యని బ్రాహ్మణులు ఎలా రూపాంతరం చేసి భరతనాట్యం, carnatic సంగీతం అని ప్రాచుర్యం చేసారో, ఆంటీనాచ్ (Anti Nach) ఉద్యమంలో దేవదాసీల ఎలాంటి కష్టాలు పడ్డారో, పెరియర్ తీసుకొని వచ్చిన ఉద్యమ సమయంలో తెలుగు, సంస్కృత భాషలు ఎలాంటి కష్టాలు పడ్డాయి తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి.
Profile Image for Eswara Chandra Sagar.
2 reviews
February 3, 2025
కొన్ని కథలు చిరునవ్వుని పుట్టిస్తాయి, కన్నీళ్ళు పెట్టిస్తాయి, ఆడిస్తాయి, అలరిస్తాయి, మన చుట్టూ ఉన్న లోకాన్ని మరిపిస్తాయి, మనకే తెలియకుండా మనలో కనీసం ఒక రవ్వంత మార్పునైన పుట్టిస్తాయి....అలాంటి కథే ఈ మనోధర్మపరాగం.

మధురాంతకం నరేంద్ర గారికి నా హృదయపూర్వక 🙏🏻
Profile Image for Sathish Uttarapally.
14 reviews
June 25, 2022
Idi MS Subbulakshmi gaari biography meeda based ani theliyakapothe matram pedda interesting ga anpinchadu.
Displaying 1 - 4 of 4 reviews