ఎన్.ఆర్. నంది (నంది నూకరాజు) ప్రముఖ సాహితీవేత్త, కథ, నవల, నాటక రచయిత. ప్రవాసాంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపకుడు.
ఎన్.ఆర్.నంది 1933లో రాజమండ్రిలో జన్మించారు.1948లో రచయితగా కలం పట్టిన నంది దాదాపు 200 కథలు, 25 నవలలురాశారు. కొన్ని నాటకాలు, నాటికలు రాశారు. దాదాపు 20 సినిమాలకు రచయితగా పనిచేశారు. సుడిగుండాలు, తాసిల్దారుగారి అమ్మాయి, నోము, పున్నమినాగు వంటి సినిమాలకుఆయన పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, నంది అవార్డులు ఆయనను వరించాయి. ఎన్.ఆర్. నంది రాసిన మరో మొహెంజొదారో నాటకానిది విశిష్టమైన స్థానం. ఈ నాటకం 19 బాషల్లోకి అనువాదమైంది. దేశంలో దాదాపు పదివేల ప్రదర్శనలకు నోచుకుంది.