Butchi Babu was the pen name of an eminent Telugu short story writer, novelist and painter. His real name was Sivaraju Venkata Subbarao.
నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే యత్నం చేస్తాను. ప్రతి రచయితా తన రచనపట్ల అభిరుచి తనే ప్రయత్నపూర్వకంగా కలగచెయ్యాలి. నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకి గురవుతాడు. తాను కోరిన ఉద్యోగం దొరకదు, ప్రేయసి దొరకదు, స్నేహితులుండరు. తాను ఆరాధించిన ఆదర్శశిఖరాలు కూలిపోతూ వుంటే చూస్తూ ముక్కు మీద వేలేసుగుని కూర్చంటారు. బాల్యంలో తన కేవో పేచీలు, బాధలు ఏర్పడతాయి. ఒక సంఘర్షణ ప్రబలి, ద్వంద వ్యక్తButchi Babu was the pen name of an eminent Telugu short story writer, novelist and painter. His real name was Sivaraju Venkata Subbarao.
నా కథలన్నీ నే నెరుగున్న జీవితాన్ని గురించినవే. నే ఎరిగున్న మనుషులు, స్థలాలు అనుభవాలు - వీటిని గురించినవే. నా కలవాటైన ధోరణిలో, శైలిలో, నాకు చేతనైన శిల్పంతో వుంటాయి. ఈ అభిరుచీ యీ ధోరణి పాఠకుడికి నచ్చడం నా అదృష్టం. మొదట్లో నచ్చకపోయినా, నచ్చేలాగు, మెల్లమెల్లగా ఆ అభిరుచి కలగజేసే యత్నం చేస్తాను. ప్రతి రచయితా తన రచనపట్ల అభిరుచి తనే ప్రయత్నపూర్వకంగా కలగచెయ్యాలి. నిత్యజీవితంలో రచయిత సంఘర్షణకి గురవుతాడు. తాను కోరిన ఉద్యోగం దొరకదు, ప్రేయసి దొరకదు, స్నేహితులుండరు. తాను ఆరాధించిన ఆదర్శశిఖరాలు కూలిపోతూ వుంటే చూస్తూ ముక్కు మీద వేలేసుగుని కూర్చంటారు. బాల్యంలో తన కేవో పేచీలు, బాధలు ఏర్పడతాయి. ఒక సంఘర్షణ ప్రబలి, ద్వంద వ్యక్తిత్వం ఏర్పడి యీ బాధని ఇతరులతో చెప్పుగుని విముక్తుడవుతాడు. ఆ సంఘర్షణ నిలిచి, ద్వంద వ్యక్తిత్వానికి సమన్వయం కుదిరి, ఏకత్వం సాధించినవాడు అతను యోగి - ఇంక వ్రాయడు. ఈ గొడవ విని, యీ బాధని పంచుకోడానికి సిద్ధపడే పాఠకులు ఏ వొకరిద్దరో వుంటారేమో. ఒక్కడు వున్నా ఆ కథకుడు ప్రయోజనం సాధించి చరితార్ధుడైనట్లే భావిస్తాను....more