Suresh Sarika Quotes

Quotes tagged as "suresh-sarika" Showing 1-2 of 2
“చాలిక
సున్నిత భావాల తొలకరి చినుకులు
లేలేత పోలికల అలంకార హంగులు

చాలిక
గబ్బుమంటున్న గత ప్రస్థావనలు
ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు

చాలిక
నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట
నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ

ఇకపై
నియంతనై నను నేను పాలించాలి
పట్టువీడక ఆశపడినది సాధించాలి
నాలోని సత్తువంతా బయట పెట్టాలి

బ్రహ్మరాతను ధిక్కరించేలా
నా ప్రతి అడుగు పడాలి

kavithalu.in”
suresh sarika

“మతిమాలిన యువతను మధించాలి నేడు

బానిస బ్రతుకు శిక్షణలో పట్టభద్రులు మీరు
కాసుల లక్ష్య చేదనలో నిమగ్నులయ్యారు
కడుపు నిండేందుకు ఎంగిలి మెతుకులు వేరుకుంటున్నారు

నీతి మాలిన జాతి ఉమ్మిన జీవన సరళిలో
కొట్టుకుపోతున్నా గొప్ప నావికులు మీరు

జివ చచ్చిన ప్రాణులు మీరు
పిరికితనపు వారసులు మీరు
ఆత్మ వంచకులు మీరు

ప్రశ్నల రాపిడి లేదే మీలో
రగిలే ఆలోచనలెక్కడ పుట్టెను

మేలుకో
జీవిత యధార్ధమేమిటో తెలుసుకో
నీ విలువ పెంచుకునేలా మసులుకో

దాసోహమవ్వకు దేనికి
క్షణాల సుఖలకై అల్లాడకు
ఓటమి తలచి బయపడకు
వల్లకాదని వెనకడుగు వెయ్యకు
బ్రతుకుంటే చాలనుకోకు
చాలనుకుంటు సర్దుకుపోకు

సత్తువున్నోడివి నువ్వు
సందేహపడకు నీపై నువ్వు

రెప్ప పాటు కష్టం దాటితే
ఎప్పటికీ నిలిచే చరిత్ర పుడుతుంది

లే..
లేచి
నిలబడు
వొళ్ళు విరుచుకుని తిరగబడు
బలం పుంజుకుని పొరాడు
నీకు నచ్చని నీతో నువ్వు

నిన్ను కన్నోరికి పేరు తెచ్చేలా
నువ్వు కన్నోరికి స్ఫూర్తినిచ్చేలా

@సురేష్ సారిక”
suresh sarika