,

Telugu Quotes Quotes

Quotes tagged as "telugu-quotes" Showing 1-30 of 35
“ఆత్మ హత్య...
చంపెయ్యాలని వుంది ఈ మనసుని
ప్రేమంటూ గతాన్ని పట్టి వేలాడుతుంది
మూర్ఖంగా జ్ఞాపకాలను మరవనంటుంది
కదలని కాలంలో వసంతానికై ఎదురు చూస్తుంది
తరగని ఆవేదనతో ఆనందం ఎక్కడ అని వెతుకుతుంది.
@సురేష్ సారిక”
Sarika Suresh

“ప్రశ్నిస్తున్నా
వేసే ప్రతి అడుగుని నువ్వెక్కడికని ?
చూసే ప్రతి చూపుని నీ లోతేంతని ?
పలికే ప్రతి పలుకుని నీ విలువెంతని ?”
Sarika Suresh

“నేను నేనని నమ్మజాలను
ఈ మాయా, ఛాయల లోకాన
నిజమన్నది లేదిక నాకు
రేపన్నది రాదిక నాకు
ఈ క్షణమే నాకున్నది
పొందుతున్న అనుభూతే నా ఆస్తి”
Sarika Suresh

“కొండలతో, సముద్రాలతో కలసి
బ్రతికేవాడికి తుఫానులో లెక్కా?
తుఫాను తుఫానులే ఎగిరిపోతున్నాయి
ఈగల్లా ఎగిరే ఈ క్షుద్ర బాధలో లెక్కా ?”
Gunturu Seshendra Sarma, naa desam naa prajalu

Abhijit Naskar
“రెండు మనస్సుల ఏకీకరణలో లైంగిక ధోరణి అసంబద్ధం.”
Abhijit Naskar

Abhijit Naskar
“మానవ జాతి కీర్తిని పెంచే మనోభావాలకు జాతి విలక్షణతలుండవు.”
Abhijit Naskar

Abhijit Naskar
“లైంగిక సాన్నిహిత్యం గమ్యం కాదు, మానసిక ఐకమత్యానికి సుగమం చేసే మార్గం.”
Abhijit Naskar

Abhijit Naskar
“మానవునికి ఒకటి కాదు రెండు జననాలు - మొదటిడి , తల్లి గర్భం నుండి జన్మించినపుడు, మరియు రెండవది, ఆ వ్యక్తి సాంఘిక-సాంస్కృతిక పరంగా పుట్టిన అసూయలు మరియు అజ్ఞానాంధకారంలో నుండి లేచినప్పుడు.”
Abhijit Naskar, Principia Humanitas

Abhijit Naskar
“ఉత్తమ భాగస్వామిని కోరకండి. మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా మలచే వ్యక్తినే కోరుకోండి .”
Abhijit Naskar

Abhijit Naskar
“తల్లులు మరియు తండ్రులు ప్రతిచోటా జన్మిస్తారు. ప్రపంచానికి కావలసింది మాత్రం నాయకులు.”
Abhijit Naskar

Abhijit Naskar
“మహిళల అదనపుబలం ద్వారా మాత్రమే భారతదేశం పురోగతి సాధించగలదు.”
Abhijit Naskar, Prescription: Treating India's Soul

Abhijit Naskar
“తెలివితేటలతో భ్రమ భ్రాంతి లో ఉండటం కన్నా ఒక బుద్ధిహీనుడిగా ఉండుట మేలు.”
Abhijit Naskar

Abhijit Naskar
“అందం ఒక భ్రమ”
Abhijit Naskar, The Bengal Tigress: A Treatise on Gender Equality

Abhijit Naskar
“సమాజాన్ని అనుసరించడానికి మీరు పుట్టలేదు, దాన్ని ప్రేరేపించడానికి పుట్టారు - దాన్ని నేర్పటానికి పుట్టారు - సమాజాన్ని నిర్మించడానికి మీరు పుట్టారు.”
Abhijit Naskar

“మనిషిగ పుట్టడమే అద్భుతం
బ్రతికి వుండటం అదృష్టం

ముడి పడుతున్న బంధాలన్ని వరాలు
ఎదురవుతున్న అడ్డంకులన్ని విలువైన పాఠాలు

కష్టం గురుంచి చింతించక
ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయ్.”
Sarika Suresh

“అలసత్వమా..?
చేతకాని తనమా..?

కవితకు వికృత అలంకరణలు.

తెలుగు కవితా వనిత తనువుపై
దిగపడ్డట్టున్నవి పరభాషా పదాలు.

చూసి కన్ను చీదరించుకుంటుంది.
పలకలేక పెదవి బిగుసుకుంటుంది.”
Sarika Suresh

“సంస్కృత సాగరం నుండి చీలి పడిన పిల్ల కాలువ
అమ్మ(సంస్కృతి) కమ్మదనం పుణికి పుచ్చుకున్న అక్షర ధార
వేలాది పండిత వీరులు కలిసి విస్తరించిన జాడ

ఇంకినది తెలుగు భాషా వైభవం పరాయి పాలనలో
మురికి పట్టినది మిడిమిడి జ్ఞానపు రాతలతో.

బాషాభివృద్ధికి
మంచి కొట్లాటలు లేవు
పదునైన మాటల పోట్లాటలు లేవు
భాషతో ఆటపాటలడాలని లేని మనిషికి
తెలుగు మిగులున్నది సంభాషణకు మాత్రమే.”
Sarika Suresh

“చాలిక
సున్నిత భావాల తొలకరి చినుకులు
లేలేత పోలికల అలంకార హంగులు

చాలిక
గబ్బుమంటున్న గత ప్రస్థావనలు
ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు

చాలిక
నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట
నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ

ఇకపై
నియంతనై నను నేను పాలించాలి
పట్టువీడక ఆశపడినది సాధించాలి
నాలోని సత్తువంతా బయట పెట్టాలి

బ్రహ్మరాతను ధిక్కరించేలా
నా ప్రతి అడుగు పడాలి

kavithalu.in”
suresh sarika

“మతిమాలిన యువతను మధించాలి నేడు

బానిస బ్రతుకు శిక్షణలో పట్టభద్రులు మీరు
కాసుల లక్ష్య చేదనలో నిమగ్నులయ్యారు
కడుపు నిండేందుకు ఎంగిలి మెతుకులు వేరుకుంటున్నారు

నీతి మాలిన జాతి ఉమ్మిన జీవన సరళిలో
కొట్టుకుపోతున్నా గొప్ప నావికులు మీరు

జివ చచ్చిన ప్రాణులు మీరు
పిరికితనపు వారసులు మీరు
ఆత్మ వంచకులు మీరు

ప్రశ్నల రాపిడి లేదే మీలో
రగిలే ఆలోచనలెక్కడ పుట్టెను

మేలుకో
జీవిత యధార్ధమేమిటో తెలుసుకో
నీ విలువ పెంచుకునేలా మసులుకో

దాసోహమవ్వకు దేనికి
క్షణాల సుఖలకై అల్లాడకు
ఓటమి తలచి బయపడకు
వల్లకాదని వెనకడుగు వెయ్యకు
బ్రతుకుంటే చాలనుకోకు
చాలనుకుంటు సర్దుకుపోకు

సత్తువున్నోడివి నువ్వు
సందేహపడకు నీపై నువ్వు

రెప్ప పాటు కష్టం దాటితే
ఎప్పటికీ నిలిచే చరిత్ర పుడుతుంది

లే..
లేచి
నిలబడు
వొళ్ళు విరుచుకుని తిరగబడు
బలం పుంజుకుని పొరాడు
నీకు నచ్చని నీతో నువ్వు

నిన్ను కన్నోరికి పేరు తెచ్చేలా
నువ్వు కన్నోరికి స్ఫూర్తినిచ్చేలా

@సురేష్ సారిక”
suresh sarika

“, ఎప్పుడెప్పుడు ఈ సమాజంతో
సంబంధాలు తెంచుకుందామా
అని ఎదురు చూస్తున్నది మది.

రేపటితో నాకే ఒప్పదం లేదు
భరిస్తూ ఎదురు చూసేందుకు.

బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదు
ఆలోచనపై మోహపు ఛాయా లేదు

ఇంకెందుకు ఇంకా ఇక్కడ
కలుషిత మనుషుల మధ్య
కుళ్లు కంపును తట్టుకుంట్టూ

నచ్చని దారులలో పరుగెందుకు
నాకు నేను నచ్చ చెప్పుకుంటూ

బ్రతుకుతో బేరాలాడుతూ
అంతా బాగు బాగు అనుకుంటూ
కాలంతో కొట్టుకుపోవడమెందుకు

రోజురోజుకి పెరుగుతున్న విరక్తితో
నలుగురిలో సాధువులా సాగేదెందుకు

అన్నిటితో తెగతెంపులు చేసుకొని
నేనిక బంధు బంధ విముక్తుడినవ్వాలి.

ఓ దారి చూసుకుని
నేనిక బయలు దేరాలి

నాకు నేనే మార్గదర్శినై
లోక కళ్యాణ కార్యానికి సిద్ధమవ్వాలి.

స్వస్తి”
సురేష్ సారిక

“మురుగు ఆల్చిప్పలో ముత్యమట
మెత్తటి మట్టి జ్వలిస్తేనే వజ్రమట

మచ్చడిన చందమామెంత అందమట
బురద కన్న కమలముకెందుకంత సొగసట

మూణ్నాళ్లకి వడిలే పువ్వుకి పెక్కు పరిమళమట
గొంగళి పురుగు తోలు వదలగ సీతాకోక చిలుకట

పొగమంచు ముద్ద చల్లగాలికి చినుకై జారి పారునట
ఆకాశానికి అందమైన రంగట, అది మన కంటికి బ్రమట

మాయలెన్నో, ఏ నాటికి మనిషి వీటి మర్మమెరుగునో.”
సురేష్ సారిక

Dinakar Reddy
“ధనం ఒక్కటే వేదనాభరిత జీవితాన్ని దూరం చేస్తుందని నమ్మేస్తాం.”
Dinakar Reddy

Abhijit Naskar
“Scientist అంటే sunflower అనుకుంటున్నారా! Cyanide ఇక్కడ - త్రాగితే అన్ని తీవ్రవాదం మరియు ప్రాచీనత చరిత్ర పుస్తకాలలో మిగిలిపోతుంది.”
Abhijit Naskar, Bulldozer on Duty

“అవును ! నేను మోయలేని కలల్ని తూకం వేసి నా జీవితాన్ని ఈ కాలానికి అమ్ముకుంటున్నాను.”
సాహితీ సహితం

“ఈ లోకంలో అమ్మ రొమ్ము దగ్గర, బిగ్గరగా బిడ్డ పెట్టే ఆకలి కేక ఒక్కటే నిజం.”
సాహితీ సహితం

“ఈ లోకంలో అమ్మ రొమ్ము దగ్గర బిగ్గరగా బిడ్డ పెట్టే ఆకలి కేక ఒక్కటే నిజం.”
సాహితీ సహితం

“ఎదుటివారి జీవితాల్ని చూసి, బలవంతంగా నీ జీవితాన్ని కూడా అలాగే రాసుకుని తర్వాత బాధపడకు.

ఈ జీవితాలు అసమానతల కొలతలనే విషయం మర్చిపోకు.”
సాహితీ సహితం - saahitisahitam

“దరిద్రుడి ఆకలికి ఎరగా వాళ్లు విసరగా నూకలు.

పేగులు అరగగా పని చేసే ఈ ఎముకల మూకలు.”
సాహితీ సహితం - saahitisahitam

“కొండలతో, సముద్రాలతో కలసి
బ్రతికేవాడికి తుఫానులో లెక్కా?
తుఫాను తుఫానులే ఎగిరిపోతున్నాయి
ఈగల్లా ఎగిరే ఈ కుద్ర బాధలో లెక్కా ?”
Gunturu Seshendra Sarma, naa desam naa prajalu

Abhijit Naskar
“Prapancham nadi, badhyata nadi.”
Abhijit Naskar

« previous 1